Pranab Mukherjee in RSS lure విపక్షాలను చీల్చే అస్త్రంగా మాజీ రాష్ట్రపతి.?

Former president pranab mukherjee to address rss cadres in nagpur

Pranab Mukherjee, Pranab Mukherjee news, Pranab Mukherjee RSS, RSS event, Sangh Shiksha Varg, Rashtriya Swayamsevak Sangh, Indian National Congress, Mohan Bhagwat, Nagpur, RSS headquarters

Former President and Congress leader Pranab Mukherjee’s expected presence at chief guest at an event of the RSS in Nagpur has left political circles abuzz.

విపక్షాలను చీల్చే అస్త్రంగా మాజీ రాష్ట్రపతి.? ప్రణబ్ పైనే అర్ఎస్ఎస్ గురి..

Posted: 05/30/2018 05:26 PM IST
Former president pranab mukherjee to address rss cadres in nagpur

కాంగ్రెస్ కురువృద్దుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతల నుంచి పక్కకు జరిగిన తరువాత కూడా ఆయనకు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చక్కని గుర్తింపు వుంది. తాను ఎక్కాల్సిన పీఠం దేశాధ్యక్ష అసనం కాకపోయినా.. దానిని బలవంతంగా కాంగ్రెస్ ఎక్కించిందని.. తాను అశించిన పీఠం మాత్రం తనకు ఇంకా అందని ద్రాక్షగానే మారిందంటూ ఆయన తన మనస్సులోని అవేదనను తన స్వీయచరిత్ర పుస్తకంలో రాసుకున్నారు. అదే తన మనస్సులోన వున్న అలోచనను బయటపెట్టింది. దానినే టార్గెట్ చేసిన పలు పార్టీలు అయన చుట్టూ అనేక కథలు అల్లేస్తున్నాయి.  

ఈ క్రమంలో ఆయనను బీజేపి అనుబంధ సంస్థ అర్ఎస్ఎస్ తమ వార్షిక సమావేశం సంఘ్ శిక్షా వర్గ్ కు ముఖ్యఅతిధిగా అహ్వానించింది. అయితే అందుకు సానుకూలంగా ప్రణబ్ నుంచి సంకేతాలు వెళ్లడంతో ఈ కథలకు చాలా బలం చేకూరుతుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూన్ 7న మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోగల అర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరగనున్న వార్షిక సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారని సమాచారం ఇది నిజమేనా అంటూ కొందరు విస్మయం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ నేతలు మాత్రం అచితూచి మాట్లాడుతున్నారు. ప్రణబ్ ముందుగా సమావేశానికి హాజరై ప్రసంగించిన తరువాత కానీ తాము ఆయన పనయం ఎటువైపు సాగుతుందన్న విషయంలో క్లారిటీకి రాలేమని స్పష్టం చేస్తుంది.

అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో గతంలో వచ్చినట్లుగా బీజేపికి అఖండ మెజారిటీ రాదన్న విషయం తెలుసుకున్న అర్ఎస్ఎస్.. అయినా తమ బీజేపి ప్రభుత్వం మనుగడను సాగించాలంటే.. విపక్షాలకు చెందిన ఓట్లను చీల్చాలని పథకం వేసిందని.. అందులో బాగంగానే ప్రణబ్ ముఖర్జీని వాడుకుంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అదెలా అంటే.. ప్రణబ్ లాంటి కురువృద్ద నేత, అందులోనూ స్వతహాగా కాంగ్రెస్ కష్టకాలంలో వున్నప్పుడు తన వ్యూహాలతో చాణక్యుడి పాత్రను పోషించిన నేతకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో చక్కని అనుబంధం వుంది. అదే చరిష్మాను వాడుకుని ఆయన ద్వారానే విపక్షాలను చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలను ప్రారంభించిందన్న కథనాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అయితే బీజేపీ-కాంగ్రేసేతర కూటమి నుంచి ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని, ఆయన కూడా ప్రధాన మంత్రి రేసులో దిగనున్నారని తెలుస్తుంది. తమ తరపున ప్రధాని నరేంద్రమోడీ బరిలో వుండగా, కాంగ్రెస్ నుంచి రాహుల్ కూడా బరిలో నిలవనున్నారు. అయితే అదే క్రమంలో తృతీయ కూటమి తరపున ప్రణబ్ బరిలో నిలుస్తున్నారన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత జనవరిలో బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ భువనేశ్వర్ లో ఇచ్చిన విందులోనే తృతీయ కూటమి అవిర్భావమై చర్చలు జరిగాయని తెలుస్తుంది.

ఈ సమావేశంలోనే మాజీ ప్రధాని దేవెగౌడ, సీతారాం ఏచూరి తదితరులు కూడా దీనికి హాజరయ్యారు. అయితే, ఈ విందు గురించి మీడియాలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. పేరుకు ఇది బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సమావేశమే అయినా, నిజానికి ఇక్కడ కీలక చర్చలు జరిగినట్టు బయటపడింది. మూడో ఫ్రంట్ ఏర్పాటుపై వీరంతా కలసి చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కొన్ని నెలల ముందు ప్రణబ్ రాష్ట్రపతి పదవిలో ఉండగానే నవీన్ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు మమతా బెనర్జీతో ఫోన్ లో మాట్లాడారు. బెంగాల్ కే చెందిన ప్రణబ్ కు, మమతకు తొలి నుంచి  సత్సంబంధాలు ఉన్నాయి.

గతంలో ప్రణబ్ తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని రాసుకున్న సందర్భంలో మాట్లాడుతూ .. యూపీఏ-2 హయాంలో సోనియా తనను ప్రధానిని చేస్తారని భావించినట్టు చెప్పడం ద్వారా ప్రధాని కావాలన్న కాంక్ష తనలో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో తన మదిలో వున్న విషయాన్ని పసిగట్టిన ఆర్ఎస్ఎస్ ప్రణబ్ ముఖర్జీని విపక్షాలను విచ్ఛిన్నం చేసి.. వారి ఓట్లను చీల్చే దిశగా గాలెం వేసిందని, అయితే దానిని అందిపుచ్చుకన్న రాజకీయ ఉధ్దందుడు అవకాశం వస్తే ప్రధాని పీఠమెక్కాలని కూడా యోచనలో వున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలెంత అన్నది తేలాలంటే మరో ఏడాది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tom Vadakkan  RSS  pranab mukherjee  Nagpur  Mohan Bhagwat  Congress  Politics  

Other Articles