KCR May Contest in 2019 Elections from Nalgonda | జాతీయ రాజకీయాలు.. 2019లో అక్కడి నుంచే లోక్ సభకు పోటీ?!

Kcr to contest in 2019 elections

Telangana, CM KCR, National Politics, 2019 Elections, Nalgonda Parliament Constituency, KCR Nalgonda

Amid Concentrate on National Politics, Telangana Chief Minister KCR may Contest from Nalgonda MP Constituency in 2019 Elections.

నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ?

Posted: 03/05/2018 12:56 PM IST
Kcr to contest in 2019 elections

జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని, అవసరమైతే నేతృత్వం వహిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నుంచి భారీ మద్దతు లభించింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కలిసికట్టుగా కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులతో సీఎం కేసీఆర్‌ సమావేశమై కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయ శక్తిగా మూడో ఫ్రంట్‌ ఆవశ్యత గురించి వివరించారు.

అయితే సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే జాతీయ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని సీఎం ప్రకటన చేయడంపై నల్లగొండ జిల్లా నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసిన దాఖలాలు మళ్లీ లేవు. దీంతో కొత్త స్థానం నుంచే ఆయన పోటీ చెయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు  వచ్చే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచే కేసీఆర్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. తాజా పరిణామలు.. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. నల్ల గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి కేసీఆర్‌ బరిలో దిగితే ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌ వశమవడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ నిర్వహించే సర్వేలో జిల్లాలో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని తేలింది కాబట్టి, ఎంపీగా కేసీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేస్తే తమకు మరింత మేలు జరుగుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles