IT raids on Eagleton Golf Resort raises many questions కేంద్రం చతురత అడుగులకు ప్రజలు చిత్తవుతారా.?

It raids on eagleton golf resort raises many questions

Eagleton Golf Resort, it raid, Income Tax raid, congress mlas, congress gujarat mlas, rajya sabha, karnataka, amit shah, narendra modi, rajya sabha polls, Ahmed Patel, Congress leader, central government, supreme court, CBI, IT, Himachal pradesh, UttaraKhand, Goa, Manipur, Jammu kashmir

Income Tax department raids at Eagleton Golf Resort in Bengaluru raise many question in people of india.. is this what the change they needed..? is this why they opted for change in governance..? taking advantage of social issues and keeping continuous burden on middle, poor and poorest classes.

ఇది మోడీ మార్పా..? లేక మార్కు రాజకీయమా.?

Posted: 08/02/2017 01:03 PM IST
It raids on eagleton golf resort raises many questions

కేంద్ర అధీనంలో పనిచేసే సంస్థలు పంజరంలో చిలుకగా మారుతున్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షేపించినా.. వాటి తీరుమాత్రం మారడం లేదు. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. కేవలం అధికారాన్ని అంటిపెట్టుకునేందుకు అధికారపక్షాలు ఎంతటి స్థాయికైనా దిగజారుతున్నాయి. రాజకీయాలు రాక్షసక్రీడాగా మారుతున్న క్రమంలో ఎదుటివారిని ఓడించి.. తాము నెగ్గడం కోసం చకచకా పావులు కదుపుతూ కేంద్ర సంస్థలను కూడా తమ రాజకీయాలలో భాగంగా మార్చుతున్నాయి. ఇంకా మాట్లాడితే అటు రాజకీయ వేధింపులు, ఇటు అనైతిక చర్యలు మరోవైపు తమ సార్టీ అనుబంధ సంస్థలతో చంపుతామని బెదిరింపులు పాల్పడుతూ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

ఎదుటి వారు చేస్తే తప్పు అని వేలెత్తిచూపినప్పుడు.. మరి తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవే తప్పులు మరింత అధికస్థాయిలో పునారవృతం అయితే ఇదేనా మార్పు.. ఈ మార్పు కోసమేనా జనం ప్రభుత్వాలను మార్చిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దేశంలోని ప్రాంతాలు స్వచ్ఛంగా వుంటే సరిపోదు.. దేశంలోని మనుషులు స్వచ్చంగా మారడానికి ప్రభుత్వం ఏం చేయాలన్నది అలోచన చేయాలి. దేశంలో మురికివాడలుంటే తప్పులేదు.. కానీ కలుషితమైన రాజకీయ వేత్తలు వుంటే మాత్రం అది దేశ ప్రజల భవిష్యత్తుకే ప్రమాదం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఎత్తిచూపడం కోసం ప్రజలు ప్రభుత్వాన్ని మార్చలేదు.

తమ అభివృద్ది, సంక్షేమాన్ని కాంక్షించేలా మంచి జరుగుతుందని, అశించి ప్రభుత్వాన్ని మార్చారు. ఏకంగా గత మూడు దశాబ్దాలుగా లేని స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టడం వెనుక గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు వుండివుండవచ్చు. కానీ అంతకుమించిన స్థాయిలో అవే తప్పిదాలు, మోసాలు, మోసపూరిత ప్రజాహామీలు, వాగ్దానాలకు తూట్లు ఇలా అనేకం జరుగుతున్నాయి. కేవలం వ్యక్తి భజనతో మాత్రమే సంతోషపడేందుకు దేశం సిద్దంగా లేదు. దేశమంటే వ్యక్తి కాదు. వ్యవస్థ. 122 కోట్ల మంది ప్రజలతో కూడాన వ్యవస్థ. ప్రజల కోసం,. ప్రజలకై , ప్రజల కోరకు ఏర్పడిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి.. అధికారంలో వున్న ప్రభుత్వాలు తమ గోప్పగా చెప్పుకోవడం మానేసి.. మేము ప్రజా సేవకులుగా మా పరిధిలో మా హయాంలో సేవకులుగా ఇంత చేయగలిగాం. అని చెప్పేలా వుండాలి.

దేశ ప్రజల కోసం మరింత చేస్తాం అనేలే కాని.. తాము అధికారంలోకి వచ్చిన ఫలాసా సమయంలో ఇంత చేశాం.. ఇన్నేళ్లుగా గత ప్రభుత్వాలు ఏం చేశాయాని నిలదీస్తే.. ఇప్పడున్న పరిస్థితులు వేరు అప్పడున్న పరిస్థితులు వేరన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తాతల కాలం నుంచి తండ్రుల కాలం.. తండ్రుల కాలం నుంచి తనయుల కాలం.. తనయుల కాలం నుంచి మనుమల కాలం వరకు వచ్చేశాం. అయినా.. ఎడ్లబండ్ల కాలం నుంచి సైకిళ్లు.. రిక్షాలు నుంచి అటో రిక్షాలు.. టాక్సీలు, విమానాలు ఇలా ఎంతో అభివృద్ది జరిగింది.

మరీ ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన సోషల్ మీడియా భారత్ లో అందుబాటులోకి వచ్చింది.. విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు కారణం ఎవరు..? దేశంలో గరీభీ హటావో అన్న నినాదాన్ని తీసుకువచ్చింది ఎవరు..? గ్రీన్ రివల్యూషన్ కు దోహదపడింది ఎవరు..? దేశం సుస్థిరంగా అభివృద్ది చెందాలంటే భారీ ప్రభుత్వ రంగ సంస్థలు వుండాలని భావించి.. అ దిశగా అడుగులు వేసింది..? ఎవరు..? ఇవన్నీ కేవలం ఐదేళ్లో జరిగిపోయాయా..? అన్న ప్రశ్నలు కూడా పాలకులు తమను తాము వేసుకోవాల్సిన తరుణం అసన్నమైంది. చమత్కారపూరితంగా మాట్లాడటంలో దిట్టైనంత మాత్రాన.. ప్రజలకు పాలకులిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోతారా..?

అవినీతి లేని సమాజ నిర్మాణం జరుగుతుందని ప్రగాల్భాలకు పోతున్న పాలకులు.. పోరుగున్న ధాయాధి దేశంలో ఏకంగా ప్రథాని నవాజ్ షరీఫ్ పదవీచుత్యుడు కావడానికి కారణమైన పనామా పేపర్లలో మనవాళ్లు కూడా వున్నారుగా.. అ దిశగా కేంద్రం ఏం చర్యలు తీసుకుంది..? పనమా పేపర్ల వ్యవహారాన్ని అటకెక్కించడం తప్ప.? ఎన్నికలలో గెలిచిన తరువాత విదేశాల నుంచి నల్లధనం తీసుకువస్తామని చెప్పిన పాలకులు.. ప్రతీ భారతీయుడి అకౌంట్ లో ఆ డబ్బులు వేస్తామని చెప్పారు..? ఆ హామిని ఇంకెన్నేళ్లు కావాలన్న విషయం వారికే తెలియాలి. ఇక నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు.. అవినీతి అరికట్టడం కోసమే... నకిలీ ధనాన్ని అంతమొందించడం కోసమే.. నల్లధనాన్ని రూపుమాపడం కోసమే అని చేప్పిన లక్ష్యాలు ఏమైనా నెరవేరాయా..? ఎంతవరకు నెరవేరాయి..

ఈ మార్పు వల్ల దేశ సామాన్య ప్రజానీకానికి ఒనగూరిన లాభం ఏంటి..? బ్యాంకుల వద్ద క్యూలైన్లు.. బారులు తీరిస జనంలో నోట్లను మార్చుకోవడం తప్ప మిగిలిందేమిటి..? ఇక్కడే మరో ప్రశ్న కూడా ఉత్పన్నం కాక మానదు. అసలు జరిగింది నోట్ల రద్దా..? నోట్ల మార్పిడా..? ఈ విషయాన్ని పక్కనబెడితే.. నోట్ల రద్దు తరువాత లంచాలు తీసుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగిందన్నది వాస్తవం. అడ్డగోలుగా వ్యాపారులు పుకార్లు సృష్టించి చివరకు ఉప్పు మీద కూడా వ్యాపారం చేసిన డబ్బును సంపాదించుకున్నారు. వాటిపై చర్యలేవి. నోట్ల రద్దు తరువాత కోట్లకొద్ది డబ్బు అక్రమంగా ఎంతో మంది ఖాజానాల్లోకి తరలి ఎలా వెళ్లింది..? సామాన్యులకు అడ్డువచ్చే నిబంధనలు సంపన్నులకు మాత్రం ఎందుకు వర్తించలేదు..?

ఇక తాజా విషయానికి వస్తే.. కేంద్రంలోని అధికార పార్టీకి.. పలు రాష్ట్రాలలో సంఖ్యాబలం లేకున్నా అనైతిక పోత్తులతో కలసి ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేసింది. ఇందులో అవతలి పార్టీలకు అధికార పార్టీలిచ్చిన తాయిలాలేంటి.? వారిని ఎలాంటి ప్రలోభాలకు గురిచేసి మీ పార్టీతో జతకలిసేలా చేశారు..? విపక్షాలకు చెందిన ప్రభుత్వాలు కొలువుదీరిన రాష్ట్రాల్లో ఎలా ఎమ్మెల్యేలను విడగొట్టారు..? తాజాగా బీహర్ రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం వల్ల ఆ ప్రజలకు జరిగిన మేలేంటి..? మీ పార్టీ అధికారాన్ని పంచుకోవడం తప్ప..? ఈ విషయాలు సామాన్యులకు కూడా చర్చించుకునే స్థాయికి వెళ్లాయి. కేవలం రాజకీయం కోసమే పార్టీలు ప్రజల జపం చేస్తే.. వారికే లబ్ది చేకూరుతుందన్న విషయాలను కూడా పాలకులు అలోచించాలి..?

జీఎస్టీ మూలంగా దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అన్న పాలకులు.. అనేక రాష్ట్రాలలో సీజీఎస్టీ.. ఎస్జీఎస్టీ అమలు ఎందుకు అమలవుతున్నాయో అన్న విషయమై ప్రజలకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. ప్రజల సోమ్ముతోనే వారికి లబ్ది చేయాలంటే.. ఇక ప్రజలు కడుతున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిధులు ఏమవతున్నాయి..? ఎక్కడకు వెళ్తున్నాయి..? బ్యాంకులలో వడ్డీల విషయంలో కూడా సామాన్యులను ఒకలా.. సంపన్నులకు మరోలా ఎందుకు వ్యత్యాసం ప్రదర్శిస్తున్నారు. సామాన్యుల ఓట్లతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు సంపన్నులకే ఎందుకు పట్టం కట్టాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకువచ్చిన పాలకులు.. అదే తరహాలో దేశ ప్రజలందరికీ ఒకే విధమైన ఉచిత అరోగ్య పథాకాలను ఎందుకు వర్తింపజేయరు.. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానాన్ని తెచ్చిన స్రభుత్వాలు దేశప్రజలందరికీ ఒకే బడి విధానాన్ని ఎందుకు తీసుకురావు..?

ఎవరెవరినీ ఎలా వినియోగించుకుంటుంది..? ఎలా లొంగదీసుకుంటుందన్న విషయాలపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారన్నది కూడా మర్చిపోరాదు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ అభిప్రాయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఇక్కడ కూడా తమకు అనుకూలంగా వున్న అభిప్రాయాలను మాత్రమే స్వాగతించి.. వ్యతిరేకంగా వున్న అభిప్రాయాలపై తమ చేతులకు మట్టి అంటకుండా అంతా చట్టం చేతుల్లో వుందని వారిపై కేసులు పెట్టి.. వారిని కష్టాల పాలు చేయడం ఎంతవరకు సమంజసం.. ఇదే నా మార్పు..? ఇదేనా ప్రజలు కోరుకున్నది..? ఇందుకోసమేనా.. ప్రజలు మీకు మునుపెన్నడో మూడుదశాబ్ధాల క్రితం వున్న స్థాయిలో సంఖ్యాబలాన్నిచ్చి అధికారాన్ని కట్టబెట్టింది. అన్న ప్రశ్నలు మాత్రం తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eagleton Golf Resort  it raid  congress  gujarat mlas  rajya sabha  karnataka  rajya sabha polls  BJP  Ahmed Patel  

Other Articles