అప్పుడు దొంగ.. ఇప్పుడు హీరో... రెండూ ఒక్కరి పనేనా? | Jailed business man hailed by media.

Yellow media praises nimmagadda prasad

Nimmagadda Prasad, Nimmagadda Prasad Yellow Media, Nimmagadda Prasad Saaho Baahubali, Nimmagadda Prasad Media, Nimmagadda Prasad Hero, Nimmagadda Prasad Politics, Nimmagadda Prasad Baahubali 2 Investment, Jagan Illegal Assets Case Nimmagadda Prasad

When Nimmagadda Prasad was Jailed some media groups deride him seriously. Now, As part of that he made huge investments in Baahubali-2, the same media, hailed him as a Saho-Baahubali.

అప్పుడు మోసగాడు.. ఇప్పుడు మోసేస్తున్నారు

Posted: 04/05/2017 03:29 PM IST
Yellow media praises nimmagadda prasad

కేవలం వార్తలను వార్తల్లాగా ప్రజంట్ చేయకుండా, తమలోని అడ్డమైన కోణాల్ని సమాజంపై రుద్దటం ఇప్పుడున్న మన మీడియాకు బట్టర్ తో పెట్టిన విద్య. విశ్లేషణల పేరిట తమలోని లోతైన పరిజ్నానాన్ని(పైత్యాన్ని) బయటికి తీసి గంటా, అరగంటా ప్రోగ్రాంలు చేస్తూ సమాజానికి ఏదో చెప్పాలన్న యత్నం చేస్తుంటారు కొందరు. ఈ ప్రయత్నంలో వారు చేసే కొన్ని చిన్ని చిన్ని పొరపాట్లపై అవతలి వాళ్లు విశ్లేషణ చేస్తే భలేగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటిదే ఇక్కడ ఒకటి చూద్దాం.

ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొంత కాలం క్రితం అడ్డగోలుగా ఇన్వెస్ట్ మెంట్ లు చేసి విపరీతమైన లాభాలు ఆర్జించాడు. అంతేకాదు ప్రభుత్వంకు సంబంధించిన ఓ మీడియా గ్రూపులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అయితే అదంతా క్విడ్ ప్రో కో ప్రకారం అవినీతి సొమ్మేనని సీబీఐ నిరూపించటంతో కటకటాల పాలయ్యాడు. దీంతో సదరు బిజినెస్ మెన్ గురించి నాన్ స్టాప్ గా కథనాలు ప్రసారం చేసేసింది అవతలి మీడియా. మీరూ ఊహించింది, ఇక్కడ చెప్పుకుంటుంది మ్యాట్రిక్స్ లాబోరేటరీస్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ గురించి... ఇక ఆ రెండు ఛానెళ్లు ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

కట్ చేస్తే కొంత కాలం జైల్లో ఉన్న ఆయన బయటికి వచ్చాడు. మీడియా కంట పడకుండానే లో ఫ్రోఫైల్ మెయింటెన్ చేస్తూ అదే సమయంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం మారటం లేదు. ఉన్న సినీ ఇండస్ట్రీ పరిచయాలతో ఏకంగా బాహుబలి-2 లాంటి క్రేజీ ప్రాజెక్టులోనే భారీగా ఇన్వెస్ట్ చేశాడు. ఇంకేం అప్పుడు ఏ మీడియా అయితే అవినీతి పరుడు అంటూ ఏకీ పడేసిందో అదే మీడియా ఇప్పుడు ఆయన గొప్పోడంటూ మునగ చెట్టు ఎక్కించేస్తోంది. సాహో-బాహుబలి అంటూ ప్రత్యేక కథనాలు కూడా రాసేస్తోంది.

సాక్షి లో ఉన్నంత కాలం దొంగలా కనిపించిన ఆయన ఇప్పుడు బాహుబలిలో పెట్టుబడులు పెట్టేసరికి తెలుగు ఖ్యాతిని నిలబెట్టే ఓ బృహత్తర కార్యానికి అండగా నిలుస్తున్న పెద్ద మనిషిలా కనిపించేస్తున్నాడు. మార్పు సహజమే అయినా మరీ ఇంతలానా?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nimmagadda Prasad  Baahubali 2 Investment  

Other Articles