కారులో కోవర్టులు.. ఎందుకు భరిస్తున్నాడు? | TRS MPs Covert to KCR for BJP.

Why kcr ignored trs mps bajana to bjp

TRS MPs, TRS BJP, KCR Coverts, KCR Covert MPs, KCR BJP Relation, KCR Disciplinary Action, KCR TRS Coverts, TRS Party, TRS Two MPs, TRS to BJP, BJP Bajana, TRS Vocal Support BJP

Two TRS MPs are devoting more time to the BJP than their own party. Relying on the BJP because KCR has not been extending any assistance or are they acting as coverts of KCR?.

బీజేపీ భజనను కేసీఆర్ పట్టించుకోడా?

Posted: 02/06/2017 12:15 PM IST
Why kcr ignored trs mps bajana to bjp

చిన్నపాటి విమర్శలు వస్తేనే నిర్దాక్షిణ్యంగా పక్కకు పెట్టేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్లను ఇంకా సహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చెట్టు నీడలో ఉండి, మరో చెట్టు ఫలాల రుచి గురించి పొగడ్తలు కురిపించినట్లు టీఆర్ఎస్ లో ఇద్దరు ఎంపీల వ్యవహారం ఇప్పుడు మిగతా నేతలకు మింగుడు పడకుండా పోతోంది.

మీడియాలో ఎప్పుడు కనిపించే ఈ ఇద్దరు ఎంపీలు ఈ మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నామం జపిస్తుండటమే దీనికి నిరద్శనం. ఒకరేమో ఓ బీజేపీ ఎంపీ ద్వారా తన వ్యక్తిగత పనులు చేయించుకుంటే, మరోకరేమో నిర్మోహమాటంగా బీజేపీ నిర్ణయాలను పొగుడుతూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. మొదటి పెద్ద మనిషి తరచూ ఢిల్లీ టూర్లూ వేస్తూ, అక్కడి కమల అగ్రనేతలతో షికార్లు కొడుతూ కనిపిస్తున్నాడు. ఇక మరో నేత సొంత పార్టీ ఎంపీ యూనియన్ బడ్జెట్ పై విమర్శలు కురిపించాక కూడా పొగుడుతూ ఓ ప్రకటన చేశాడు. అంతేందుకు ఆ మధ్య నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా మద్ధతు ఇస్తున్నట్లు తెలిపాడు కూడా.

కేంద్రంతో సత్సంబంధాలు జరుపుతున్నప్పటికీ, మరీ ఈ ఇద్దరు ఇంతలా భజన చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా కేసీఆర్ కు తెలిసే జరుగుతుందా? లేక జరిగాక కూడా డిసిప్లిన్ కు మారుపేరైన కేసీఆర్ ఎందుకు సహిస్తున్నాడు? అన్న పాయింట్లపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొంపదీసి వీరిద్దరు పార్టీ కోవర్టులు కారు కదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పలువురు సీనియర్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  TRS MPS  BJP  Vocal Support  

Other Articles