చిరు, పవన్ లతో సిద్దూకి పోలికేంటో? | Navjot Singh Sidhu's Googly Signals New Punjab Strategy. Sidhu compare with Chiru And Pawan.

Why sidhu not contesting in punjab elections

Sidhu's Googly in Punjab Elections, Awaaz-e-Punjab Punjab Elections, Navjot Singh Sidhu's Awaaz-e-Punjab, Sidhu Pawan Kalyan, Sidhu Chiranjeevi, Awaaz-e-Punjab Janasena, Awaaz-e-Punjab Prajarajyam, Awaaz-e-Punjab founder, Awaaz-e-Punjab political Front, Awaaz-e-Punjab not party

Navjot Singh Sidhu's Awaaz-e-Punjab not contesting in 2017 Punjab elections.

సిద్ధూ తూచ్ ఎందుకు చెప్పాడు?

Posted: 09/22/2016 01:15 PM IST
Why sidhu not contesting in punjab elections

అధికారంలో ఉన్న బీజేపీని కాదని, ఎంపీ పదవితోపాటు ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేశాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఆపై పంజాబీల హక్కుల కోసం పోరాటం అంటూ ఆవాజ్-ఇ-పంజాబ్ పేరటి ఏకంగా ప్రత్యేక ‘పార్టీ’ నే పెట్టి పడేశాడు. తమతో కలిసొచ్చే ఏ ఒక్కరినీ వదలుకోబోమని ఆవిర్భావ సందర్భంగా చెప్పుకోచ్చాడు కూడా. అయితే ఉన్నపళంగా మాట మార్చిన లాఫింగ్ సిద్దా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదంటూ బాంబ్ పేల్చాడు.

పంజాబ్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏఈపీ పార్టీ కాదని, కేవలం రాజకీయ ఫ్రంట్ మాత్రమేనని బంతిని గూగ్లీ తిప్పేశాడు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకుగాను కూటమిలో చేరాలని అనుకుంటున్నామని, ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 117 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని సిద్ధూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే సిద్ధూ తాజా ప్రకటన చేయడం గమనార్హం.

అయితే ఈ పరిణామాలను ఏపీ రాజకీయాలకు ముడిపెట్టి కొందరు మేధావులు చర్చించుకుంటున్నారు. సిద్దూ పార్టీ అనౌన్స్ తదనంతరం చేశాక, ప్రజారాజ్యం మాదిరి చీల్చి రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తుందని కొందరు, తాజా ప్రకటనతో కాదు కాదు... పవన్ కళ్యాణ్ జనసేన లాగా కూటమి తరపున మద్ధతు ఇస్తుందని, తద్వారా కూటమి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తుందని ఇలా ఎవరి వర్షన్ లో వారు కంపేర్ చేసేసుకుంటున్నారు. అయితే సిద్దూ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతోనే ఉన్నాడు.

కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని, మూడు నెలలు చాలా తక్కువ సమయమని చెప్పేశాడు కూడా. పంజాబ్ పునర్వైభవం పేరిటగత జులైలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ రాజకీయాల్లో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. ఆప్ నుంచి తన భార్యకు మంత్రి పదవి, కాంగ్రెస్ లో కూడా చేరాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు వివరించాడు. అయితే ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ తో బేరం ఇంకా కొనసాగుతుందన్న నేపథ్యంలో సిద్ధూ స్టేట్ మెంట్ తర్వాత పరిస్థితులు మారినా మారోచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navjot Singh Sidhu  Awaaz-e-Punjab  Not Contesting  Punjab Elections  

Other Articles