టీఆర్ఎస్ నుంచి సొంత గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు | two TRS MLAs back to TDP party

Two trs mlas back to tdp party

TTDP deficit MLAs back, TRS to TDP, TDP MLAs back to Party, TTDP MLAs back, TRS to TTDP, Maganti and Vivek back to TDP

Two TDP deficit MLAs back to Home party. They have no priority in TRS.

ఇద్దరు గులాబీ నేతలు బ్యాక్ టూ టీడీపీ?

Posted: 08/23/2016 02:50 PM IST
Two trs mlas back to tdp party

నయానో భయానో, ఆశచూపో అసలు తెరవెనుక ఏం భాగోతాలు జరిగాయో తెలీదు కానీ మొత్తానికి ఫిరాయింపులతో తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసి పడేసింది అధికార పక్షం. వీరిలో కొందరు బలవంతంగా చేరారనే టాక్ కూడా ఆ మధ్య వినిపించింది. అయితే పవర్ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతుందట. ముఖ్యమైన స్థానాలకు చెందిన వారికి కనీసం సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు తిరిగి టీడీపీ గూటికే చేరతారనే వార్తలు వినిపిస్తాయి.

ఓటుకు నోటులో సంబంధం ఉందని ఆరోపణలు వినిపించిన నగరానికి చెందిన ఎమ్మెల్యే తిరిగి సైకిల్ ఎక్కబోతున్నాడని పలువురు అంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినప్పుడే అంతా షాకయ్యారు.  చంద్రబాబుకు చాలా దగ్గరి వ్యక్తిగా పేరొందిన ఆయన కారెక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.  తాను అధికార పార్టీలో చేరాల్సి వెనుక బ్లాక్ మెయిలింగ్ పరిస్థితులు నెలకొనటంపై చంద్రబాబుకు వివరించిన తరువాత పార్టీ మారారన్న వాదనా ఒకటుంది. అయితే తాజాగా ఆయన కుడి భుజంగా వ్యవహరించే నేత తిరిగి టీడీపీలో చేరటం, ఈ  సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపు ఆయన చేరికనే కన్ఫర్మ్ చేస్తున్నాయి.  

ఇక మరో మరి నేత విషయానికొస్తే... గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గెలిచిన సదరు యంగ్ ఎమ్మెల్యే ఊరిస్తూ ఊరిస్తూ టీఆర్ఎస్ లోకి చేరారు. అధికార పార్టీలోకి వెళితేనే త‌న క‌ష్టాలు తీర‌తాయ‌ని భావించిన ఆయ‌న కాస్త అయిష్టంగానే గులాబి కండువా క‌ప్పుకున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అధికారంలో ఉండి కూడా ఆయనకు అవమానాలే ఎదురయ్యాయి. ఓ భారీ భవన నిర్మాణంలో వివాదాల్లోకి ఎక్కారు. ప్రభుత్వంలో ఉండి కూడా తన పని చేయించుకోలేకపోయాడు. దీంతో మనస్థాపం చెందిన ఆయన తిరిగి సొంత పార్టీకే చేరాలని డిసైడ్ అయ్యాడంట. అయితే తెదేపా నుంచి వెళ్లిన ఈ ఇద్దరేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP  TRS  two MLAs  back  

Other Articles