#27SaalUPBehal: Sheila Dikshit begins 3-day bus tour to Kanpur, initiating Congress’ Uttar Pradesh poll campaign

27 saal up behaal congress uttar pradesh poll campaign slogan

up assembly elections, uttar pradesh, Congress, Sheila dixit, Raj babbar, Varanasi, Sonia gandhi, Rahul Gandhi, Prashanth kishore, PM Modi, Amit shah, BJP, samajwadi party, BSP, Mayawati, akilesh yadav, mulayam singh yadav

The title of the campaign, '27 Saal, UP Behal' is intended to highlight the misrule under the non-Congress governments in the state since the past 27 years.

కుంభస్థలాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్..

Posted: 07/23/2016 01:00 PM IST
27 saal up behaal congress uttar pradesh poll campaign slogan

తన సత్తా ఏంటో యావత్ దేశానికి చూపించాలంటే చిన్న రాష్ట్రలలో అధికారం రాబట్టుకోవడం కాదు.. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని.. దాంతోనే మళ్లీ దేశంలో కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అందుకు అనుగూణంగా పావులు కదుపుతుంది. ఇటీవల కాలంలో కేవలం చిన్న రాష్ట్రాలైన మిజోరం, పాండిచ్చేరిలలో అధికారాన్ని చేప్టటిన కాంగ్రెస్ అధిష్టానం.. రాజకీయంగా అత్యంత కీలకమైన, దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లోనే తమ సత్తాను చాటాలని భావిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలలో యూపీలో సత్తా చాటిన బీజేపిని ఖంగుతినిపించాలని కంకణం కట్టుకుని గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీజేపితో పాటు అటు రాష్ట్రంలో బలంగా వున్న సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలను ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ తమ పార్టీ ప్రణాళికలను, వ్యూహప్రతివ్యూహాలను సిద్దం చేసుకుని కదులుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తర్ ప్రధేశ్ ఎన్నికల్లో ప్రచారానికి నడుంచుట్టింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మార్గనిర్దేశంలో ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా లక్నో నుంచి కాన్పూర్ వరకు 600 కిలోమీటర్ల బస్సుయాత్రను ప్రారంభించింది.

యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తదితర సీనియర్ నేతలు పాల్గొనే ఈ బస్సుయాత్రను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇవాళ జెండాలు ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలందరూ కలసికట్టుగా పనిచేస్తే.. విజయం తప్పక వరిస్తుందని, కాంగ్రెస్ ను ఓడించే శక్తి దేశంలో ఏదీ లేదని.. అయితే తమ నేతల అంతర్గత కుమ్ములాటలే పార్టీకి శరఘాతంలా పరిణమించి ఓటమిని చవిచూస్తుందని, ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ నేతలందరూ ఐక్యంగా పాటుపడి పార్టీ పునర్ వైభవానికి కంకణ బద్దులు కావాలని, ఇక్కడి నుంచే యావత్ దేశానికి కాంగ్రెస్ సత్తా ఏమిటో చాటాలని కూడా పార్టీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.

ఇక వ్యక్తి భజనలో ఇమిడిపోయే పార్టీలు కొంతకాలం మాత్రమే మనుగడ సాగిస్తాయని, ఇక మానియాలు, మంత్రాలు అన్ని చోట్ల, ఎల్లవేళలా పనిచేయవని ఇప్పటికే ఢిల్లీ, బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా అగ్రనేతలు సూచించినట్లు తెలుస్తుంది. కాగా సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీశ్‌కుమార్‌తో జతకట్టి.. వారికి ఎన్నికల విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్.. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చేతలు కలిపిన సంగతి తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలను రచించి ఇవ్వడంతో వాటినే అయుధాలుగా చేసుకుని కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ బరిలో దిగుతుంది. తాజాగా యూపీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రచార నినాదాన్ని ఆయన ఖరారు చేశారు.  27 సాల్‌.. యూపీ బెహాల్ (27 ఏళ్లు యూపీని నాశనం చేశారు) అనే నినాదంతో హస్తం ప్రజల్లోకి వెళ్లనుంది. యూపీలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన గత 27 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ ప్రచారం చేయనుంది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన పార్టీలు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పాటుపడ్డాయని, రాష్ట్ర అభివృద్దిని మర్చిపోయాయని, రాష్ట్ర ప్రగతి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని పలుకుతూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.

అటు పనిలో పనిగా ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలోనూ తమ సత్తా చాటి బీజేపికి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ బలంగా ముందుకు కదులుతుంది. ఇందుకోసం వారణాసిపైనా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆగస్టు 2న వారణాసిలో సానియాగాంధీ భారీ రోడ్డుషో చేపట్టే అవకాశముంది. ఆ తరువాత కూడా పలుమార్లు వారణాసిలో ర్యాలీలు చేపట్టనున్నట్లు సమాచారం. వారణాసీ పార్లమెంటరీ స్థానం నుంచి అధిక స్థానాలను తాము కైవసం చేసుకుంటే.. అదే రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి దేశప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ వచ్చేవారం లక్నోలో 50వేల పార్టీ కార్యకర్తలతో సదస్సు నిర్వహించనున్నారు. వ్యవస్థీకృత కార్యకర్తల బలం వల్లే పార్టీ విజయాలు సాధిస్తున్నదని గ్రహించిన కాంగ్రెస్‌ తన కార్యకర్తలను కూడా వ్యవస్థీకరించుకొని..కట్టుదిట్టంగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles