జగన్ ను వణికిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు | YSRCP and TDP both eyed on 4th rajyasabha seat

Ysrcp and tdp both eyed on 4th rajyasabha seat

YS Jagan, YSRCP, rajyasabha 4th seat, వైఎస్సార్సీపీ, టీడీపీ, జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, నాలుగో రాజ్యసభ స్థానం, latest news, AP politics

tsp try for drag more ysrcp MLAs over 4th rajyasabha seat. jagan alert with that signal. keep in touch with MLAs

జగన్ ను వణికిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Posted: 05/31/2016 12:09 PM IST
Ysrcp and tdp both eyed on 4th rajyasabha seat

నవ్యాంధ్రలో ప్రస్తుతం ‘ఛీప్ పాలిట్రిక్స్’ జరుగుతున్నాయి. ఓవైపు నాలుగో రాజ్యసభ స్థానం పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇరు పార్టీలు టెన్షన్ పడిపోతున్నాయి. పెద్దల చిచ్చుతో కాస్త తడబడ్డ టీడీపీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటిస్తే, ఇటు వైసీపీ ఏకగ్రీవం కోసం ఫ్లాన్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2 కి చంద్రబాబు తెర లేపడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే  వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ప్రకాశం నుంచి మరో ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే మొత్తం 19 మంది. కానీ, రాజ్యసభ స్థానం కోసం మద్ధతు కావాలంటే బలం 36 కావాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు గాలం వేసేందుకు అల్రెడీ జంప్ అయిన వారి సహకారం తీసుకోనున్నాడు చంద్రబాబు. జలీల్ ఖాన్, సుజయకృష్ణ రంగరావు, గొట్టిపాటి రవి ఇప్పటికే రంగంలోకి దిగి తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలను లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పాత సహచరులతో ఓట్లు వేయించి నాలుగో అభ్యర్థిని గెలిపించే బాధ్యత వీరే తీసుకున్నట్లు సమాచారం.

నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డికి ఈ అవకాశందక్కే అవకావాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేర సిద్ధంగా ఉండాలని ఆయనకు సంకేతాలు కూడా పంపారంట. అయితే కొంతమంది సీనియర్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని నిలిపింది. సరిపడా బలం లేకపోయినా ఎలా చేశారంటూ అప్పుడు టీడీపీ దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు నాలుగో అభ్యర్థిని దింపినా అలాంటి విమర్శలే రావొచ్చని వారంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని నేతలకు బాబు సూచించాడంట.

మరోవైపు ఆకర్ష్ కి లొంగ కుండా తన ఎమ్మెల్యేలను కట్టడి చేసే పనిలో ఉన్నాడు జగన్.  అల్రెడీ జంప్ అయిన ఎమ్మెల్యేలతో  మిగాతావారికి సంబంధాలు లేకుండా వారి ఫోన్ లను స్విఛ్ఛాప్ చేయించటంతోపాటు, ఇంకొందరిని  ఏకంగా విదేశీ పర్యటనలకు పంపించాడంట. అదే క్రమంలో అసంతృప్తితో ఉన్న నేతల కోరికలను తీర్చేందుకు ఆయన సిద్ధమయ్యాడు కూడా. ఎన్నికలు జరిగే 11వ తేదీ వరకు వారిని కట్టడి చేయగలిగితే చాలన్నది ఆయన ఉద్దేశం. అలాగే టీడీపీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా జగన్ ఓ కన్నేసి ఉంచాడు. ఇందుకోసం విజయసాయిరెడ్డియే స్వయంగా వారి వారి ఇళ్లకు పంపి వారి సమస్యలు తీర్చాలని చెబుతున్నాడంట.   ఆర్థిక సమస్యలతో సైకిల్ ఎక్కుదామని రెడీగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి విజయసాయిరెడ్డి ఆయన సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఇదే బాటలో ఉన్న మరికొందరి డిమాండ్లు కూడా నెరవేర్చాలని, ఎట్టి పరిస్థితుల్లో వారు చేజారకుండా చూడాలని సీనియర్లకు జగన్ సూచించాడంట. ఒకవేళ వరకూ టీడీపీ నాలుగవ అభ్యర్ధిని నిలబెట్టకపోతే వైసీపీ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది కాబట్టి ఆ రోజు తమ ఎమ్మెల్యేలను అజ్నాతంలోనే ఉండేలా జగన్ చూసుకుంటున్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  rajyasabha 4th seat  

Other Articles