కేసీఆర్ ను పెడదారి పట్టిస్తున్నదెవరు? | every one shock with kcr rajyasabha strategy

Every one shock with kcr rajyasabha strategy

Chandrasekhar Rao, two Rajya Sabha seats, D. Srinivas, V. Laxmikantha Rao, తెలంగాణ న్యూస్, కేసీఆర్, రాజ్యసభ, నామినేటెడ్ పోస్టులు, తెలంగాణ వార్తలు, telangana news, telangana political news, telugu news, politics, latest news

కేసీఆర్ ను పెడదారి పట్టిస్తున్నదెవరు? | every one shock with kcr rajyasabha strategy

కేసీఆర్ ను పెడదారి పట్టిస్తున్నదెవరు?

Posted: 05/27/2016 03:58 PM IST
Every one shock with kcr rajyasabha strategy

రెండు రాజ్యసభ స్థానాల కోసం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా సీనియర్ నేతలు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లు తెర మీదకు రావటంపై కేసీఆర్ దగ్గరి మనుషులు కూడా షాక్ కి గురికావాల్సివచ్చింది. అసలు ఇంత గోప్యత ప్రదర్శించి పేర్లు ప్రకటించాల్సి రావటం వెనుక పరిస్థితులు ఏంటని వారు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. పెద్దల సభకు లక్ష్మీకాంతరావు ఓకే గానీ, డీఎస్ పేరు అసలు తెరపైకి ఎలా వచ్చిందా అని మల్లాగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పక్షంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు డీఎస్. పైగా పీసీసీ చీఫ్ తోపాటు మంత్రి పదవిని కూడా అనుభవించారు. కానీ, తెలంగాణ కోసం ఏనాడూ స్వరం పెంచి మాట్లాడటంకానీ, అధిష్ఠానం పై ఒత్తిడి తేవటంలాంటివి చేసిన పాపాన పోలేదు. అయినప్పటికీ తెలంగాణ ఏర్పాడ్డాక ఆయన్ని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి మరీ రాష్ట్ర గౌరవ సలహాదారునిగా నియమించారు కేసీఆర్. అసంతృప్తి ఉన్నప్పటికీ కేసీఆర్ నిర్ణయానికి ఎదురు చెప్పే దమ్ములేక అంతా సైలెంట్ అయిపోయారు. నిజామాబాద్ లో పట్టు ఉన్న వ్యక్తి, పైగా రాజకీయ అనుభవజ్ణుడు కావటంతో ఆ పని చేసి ఉంటారని ఇంకొందరు సముదాయించుకున్నారు.  కానీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ కిరీటాన్ని కట్టబెట్టాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

కాస్త లోతుగా వెళితే దీని వెనుక పెద్ద కథే నడుస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ గా ఉన్నారు. రెండేళ్లుగా సొంత నియోజక వర్గానికి దాదాపు దూరంగానే ఉంటున్నారు ఆమె. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారంట. తద్వారా మంత్రి పదవి, ఆపై ఏకంగా సీఎం రేసులో నిలవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు నిజామాబాద్ ఎన్నిక సమయంలో డీఎస్ ఓటమిపాలైనప్పటికీ, ఆయన పలుకుబడిని దగ్గరి నుంచి చూడటం, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ముందు ఆయనను తనకు పోటీ లేకుండా అడ్డుతొలగించుకోవాలని చూస్తోందట. అందుకోసమే రాజ్యసభ స్థానానికి ఆయన పేరును ప్రతిపాదించాల్సిందిగా కొందరు సీనియర్ల సాయంతో కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చిందని అంటున్నారు.  ఇంకోవైపు ఎమ్మెల్సీ స్థానం ఎంపికలో కూడా జరిగిన తప్పిదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. తుమ్మల ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో ఖాళీ అయిన సీటును ఎవరిని సంప్రదించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఫరీదుద్దీన్ కు కట్టబెట్టారని అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రేసులో ఎంతో మంది ఉన్నప్పటికీ మంత్రిగా పనిచేశారన్న అనుభవం సాకుగా చూపటం సరికాదని వారంటున్నారు.

నిజానికి ఓ రాజ్యసభ సీటును ఉద్యమ సమయంలో తన ఆస్తులను సైతం పణంగా పెట్టిన కృషి చేసిన ఒక మీడియా అధినేతకు ఇస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ సీటును కూడా ఉద్యమంలో బలిదానం చేసుకున్న శ్రీకాంత్ చారి తల్లికి ఇస్తామనటంతో చాలా మంది స్వచ్ఛందంగా తప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఇద్దరికీ హ్యాండిచ్చినట్లయ్యింది. వీటి వెనుక రికమండేషన్లు ఉన్నాయని ఎంతవరకు వాస్తవమో తెలీదు కానీ, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారి కోసం కాకుండా ఇలా ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana CM  KCR  Chandrasekhar Rao  two Rajya Sabha seats  D. Srinivas  V. Laxmikantha Rao  

Other Articles