పవన్ కళ్యాణ్ ఛానల్ పెడతున్నాడా...? | Will Pawan Kalyan start News Channel

Will pawan kalyan start news channel

Pawan Kalyan, Newschannel, kanasena, AP, POlitics

Janasena founder and Actor Pawan Kalyan may start a newschannel in Telugu. This gossip going viral. But Pawan near people not interseted in that.

పవన్ కళ్యాణ్ ఛానల్ పెడతున్నాడా...?

Posted: 04/21/2016 02:55 PM IST
Will pawan kalyan start news channel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ఎవరికి చెప్పక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా వపన్ ఎంతో చురుగ్గా ఉంటారు. అందుకే జనసేన అనే ఓ పార్టీని స్థాపించారు. జనం కోసం.. జనంతో జనసేన అనే పేరుతో పార్టీ పెట్టి ప్రత్యక్ష ఎన్నికలకు ప్రస్తుతానికి పోకుండా కేవలం మోదీ, చంద్రబాబు నాయుడు కూటమికి బయటి నుండి మద్దతునిస్తున్నారు. కాగా 2019 ఎన్నికల్లో తాను, తన పార్టీ పూర్తి రాజకీయాల్లోకి ప్రవేశిస్తోందని ఆయన వెల్లడించారు. అంతకు ముందు ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ ఎన్నికల్లో పాలుపంచుకోలేదు.

ఎన్నికల్లో ఎందుకు పోటీ చెయ్యలేదు అంటే పవన్ కళ్యాణ్ చెప్పే సమాధానం ఏంటంటే.. తన దగ్గర డబ్బులులేవని. తన దగ్గర ఓ పార్టీని లీడ్ చేసి. ఎన్నికల్లో పాల్గొనేంత డబ్బులు లేవని, దానికి సినిమాలు తీస్తు డబ్బులు పోగేస్తున్నానని అన్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఓ న్యూస్ ఛానల్ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీకి లాభం చేకూరాలంటే ఖచ్చితంగా ఓ మీడియా సపోర్ట్ ఉండాలని అందుకే పవన్ ఛానల్ పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ పవన్ మాత్రం అలాంటి వాటి జోలికి పోరు అని ఆయనను దగ్గరి నుండి చూసిన వాళ్లు అంటున్నారు.
-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh