Is April 2 will bad day for YSRCP President Jagan

Is april 2 will bad day for ysrcp president jagan

Jagan, YS Jagan, AP, JaganMohan Reddy, April2, YSRCP MLAs, YCP MLAs

May YSRCP President YS Jaganmohan Reddy face bad time or bad day on April 2. His party MLAs joining into TDP.

ఏప్రిల్ 2 జగన్ కు బ్యాడ్ డేనా..?

Posted: 03/29/2016 05:33 PM IST
Is april 2 will bad day for ysrcp president jagan

ఏప్రిల్ 1 ఫూల్స్ డే తర్వాత, ఏప్రిల్ 2 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ డే నా ? అవును అనే అంటున్నాయి పరిస్థితులు. జ్యోతలు నెహ్రు ఎపిసోడ్ మర్చిపోక ముందే, జగన్మోహన్ రెడ్డికి గెట్టి షాక్ ఇవ్వాలి అనుకుంటుంది తెలుగుదేశం. ఏప్రిల్ 2న, పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం. 21 మందితో గంటలో నీ ప్రభుత్వాన్ని కూల్చుతా చంద్రబాబు అన్న దెగ్గర మొదలైన జగన్ పతనం, కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 8 మంది జంప్ అవ్వగా, ఇంకో పది మంది పచ్చ కండువా కప్పుకునేందుకు రెడీ గా ఉన్నారు. ఏకంగా వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జంప్ అవ్వటం జగన్ కి పెద్ద ఎదురుదెబ్బ.

ఈ పరిస్థితి జగన్ కావాలనే చేతులారా చేసుకున్నదే అన్న వాదన బలంగా ఉంది. ప్రభుత్వం చేసే మంచి పనులుకుడా విమర్శించటం, పట్టిసీమని వ్యతిరేకించటం, కాపులకి సరియిన ప్రాధ్యాన్యత ఇవ్వకపోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటంతో ఇటు కోస్తాలో, అటు రాయలసీమలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలా ఉంటె, సీనియర్లను , ఏ విషయంలోనే కాన్ఫిడెన్సులోకి తీసోకోకపోవటం, వాళ్ళకి సరియన ప్రాధాన్యత ఇవ్వకపోవటం అసలు విషయం. జగన్ క్రెడిబులిటీ రోజు రోజుకి దెబ్బతింటుంది. కేసులు ఏమి అవుతాయో తెలీదు, ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించటం లేదు. జనాలకు కావాల్సిన పోరాటం చెయ్యరు. ఇలా ప్రతి విషయంలో వెనకపడ్డం, ప్రతిపక్షంలో ఉండాల్సిన దూకుడు లేదు, అన్ని తప్పుడు నిర్ణయాలే, అసెంబ్లీలో ప్రతి విషయంలో ప్రభుత్వానిదే పై చేయి, వ్యక్తిగతంగా రాజశేఖరరెడ్డి నమ్మని వాళ్ళకోసం ఎంతకైనా తెగించేవారు, జగన్ ఎవర్ని నమ్మడు, కనీసం దెగ్గరకి కుడా రానియ్యాడు, అని వైసీపీ నాయకులూ వాపోతున్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  YS Jagan  AP  JaganMohan Reddy  April2  YSRCP MLAs  YCP MLAs  

Other Articles