Will Junior NTR support to demolish Chandrababu Govt

Will junior ntr support to demolish chandrababu govt

AP, NTR, Chandrababu naidu, jagan, YSRCP, TDP

jagan Mohan Reddy expected to take NTRs Help in the Demolish of Chandrababu naidus Govt.

బాబు సర్కార్ ను కూల్చడంతో ఎన్టీఆర్ సహాయం..?

Posted: 03/02/2016 03:11 PM IST
Will junior ntr support to demolish chandrababu govt

ఏపిలో జగన్ కు గడ్డు పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతున్నారు. అయితే అంతకు ముందు వైయస్ జగన్ చేసిన ప్రకటన ఓ రకంగా తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  అసమ్మత్తి గళాలను పోగేసే పనిలో జగన్ విఫలమయినట్లు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని రామవరప్పాడులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ పేదల పూరి గుడిసెలను తొలగించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడకు చేరుకుని.. పేదలకు అండగా నిలిచారు. అంతేకాక బాధితులతో కలిసి అక్కడే జాతీయ రహదారిపై ఆయన ధర్నాకు దిగారు. వంశీకి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామవరప్పాడు బాధితులను పరామర్శించారు. బాధితుల ఆందోళనలకు మద్దతు తెలిపిన జగన్.. వారి తరఫున కోర్టుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు వైఎస్ జగన్ మద్దత్తు ఇచ్చినట్లు అయింది. దీంతో ఎన్టీఆర్ కు  అంత్యత ప్రాణమిత్రుడైన  వంశీ కూడా జగన్ కోటరీలో ఉన్నాడట

మరోవైపు టీడీపీలో ప్రాధాన్యత తగ్గడంతో  ఎన్టీఆర్ కు, హరికృష్ణ గుర్రుగా ఉన్నారంటా..దీన్ని అవకాశం చేసుకొనే  రాజ్ భవన్ ముందు 21మంది ఎమ్మెల్యేలు వస్తే గంటలో బాబు సర్కారును కూల్చేస్తాను. టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారు, వాళ్ల పేర్లు చెప్పిన గంటలో సర్కారు పడిపోతుందని అన్నారట.  అలా అన్న జగన్ నిజంగానే….బాబు సర్కారు కూల్చే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ ను, హరికృష్ణ ను, వల్లభనేని వంశీని, మరికొంతమంది టీడీపీనేతల్ని.., వైసీపీలో చేర్చుకోగలిగితే  టీడీపీ సర్కారును కూల్చడం పెద్ద విషయం ఏమీ కాదని సమాచారం. కానీ జగన్ దీన్ని ఉపయోగించుకులేక చతికిల పడ్డారని రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : AP  NTR  Chandrababu naidu  jagan  YSRCP  TDP  

Other Articles