modi government unable to draw bihar voters attention with development

Pm modi concentrates more on critisizing oppositions than development

Bihar elections, sharad yadav, cow, NDA, congress, JDU-RJD, PM modi, narendra modi, bjp, bihar elections results, opposition parties, ruling parties, nitish kumar, lalu prasad yadav, pm modi, sushil modi, amit shah, post poll exit survey, bihar assembly polls, bihar assembly results

modi government unable to draw bihar voters attention with development mantra, concentrates more on critisizing opposition parties

అభివృద్దిని మరచి ఆవును పట్టుకున్న మోడీ..?

Posted: 11/06/2015 03:03 PM IST
Pm modi concentrates more on critisizing oppositions than development

దేశప్రజలు ప్రధాని నరేంద్రమోడీపై పెట్టుకున్న ఆశలు రోజురోజుకీ సన్నగిల్లుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ అభివృద్దిని చూని తనకు ఒక్క అవకాశం ఇస్తే.. దేశాన్ని కూడా అదేస్థాయిలో అభివృద్ది పథంలో పయనింపజేస్తానని హామీ ఇచ్చిన మోడీ.. ఏడాదిన్నర గడుస్తున్న తన హామీలను నిలబెట్టుకున్న దాఖలాలు కనబడటం లేదు. రాష్ట్రాల వారీగా బిజేపిని విస్తరింపజేసేందుకు ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల పాటను అలపిస్తున్న మోడీ.. బీహార్ లో తన పాటకు అక్కడి ప్రజలు మంత్రముగ్ధులు కాకపోవడంతో కొత్త రాగాన్ని ఆలపిస్తున్నారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో.. ఢిల్లీకి రాష్ట్రస్థాయి హోదాను కల్పిస్తామన్న బీజేపి హామీని కూడా విస్మరించిన అక్కడి ప్రజలు బీజేపికి ఘోర ఫరాజయాన్ని అందించారు. దీంతో అప్పుడే అభివృద్ది మంత్రానికి పెద్ద గాయం ఏర్పడింది. ఆ తరువాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికలలో బీజేపి ఓ చోట మెజారిగ సాధించగా, మరో చోట ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని పంచుకోవాల్సి వచ్చింది. నిత్యం రావణకాష్టంలా కాలుతున్న జమ్మూకాశ్మీర్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న బీజేపి.. ఐఎస్ జేకే జెండాలు ఎగురుతున్నా.. నిత్యం సరిహద్దులో కాల్పలు జరుగుతున్నా ఏమీ చేయలేని, నివారించలేని స్థితిలోకి జారుకుంది.

తమ పక్షాన వున్నంత వరకు అపర చాణక్యుడంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తిన బీజేపి.. ఆయన నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిని వ్యతిరేకించగానే అజాత శత్రువు కాస్తా.. ప్రధాన శత్రువగా మారాడు. సార్వత్రిక ఎన్నికలలో అ మేరకు ప్రచారం చేసిన మరీ ఓట్లను రాబట్టకుంది బీజేపి. అయితే ఇప్పుడా ప్రచారం ఫలితాలను ఇవ్వదని తెలసిపోవడంతో నితీష్ ఇలాకా జెండా ఎగురవేసేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు ప్రయత్నాలను చేసింది.

ఇప్పటి వరకు ఏ ఎన్నికలలోనూ మత రంగు పులుపుకోకపోయినా.. బీహార్ ఎన్నికలలో మాత్రం ఈ రంగు పరోక్షంగా పులుముకుంది. ఇది ప్రధాని నరేంద్రమోడీ పాలనతీరును అద్దం పుడతోంది. బీహర్ ఎన్నికలలో గెలుపు కోసం అవును కూడా అస్త్రంగా మార్చుకున్నారు ఓ వర్గం వారు. అయితే దానిని వ్యతిరేకిస్తూ మరో వర్గం వారు ప్రచారం నిర్వహించారు. దేశం పురోగాభివృద్ది అంటూ ప్రసంగాలను ఉదరగోట్టే ప్రధాని మోడీ.. అభివృద్ది పక్కన బెట్టి అవు వెంట ఎందుకు పడ్డారన్న విషయం బీహార్ వాసులు బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అవు ప్రచారం వారిని ఎంతవరకు గట్టెకిస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar elections  sharad yadav  cow  NDA  congress  JDU-RJD  PM modi  

Other Articles