TDP Leaders yellowism in the inaugration of Amaravati

Tdp leaders for amaravati inauguration

TDP, Amaravati, Iauguration, Chandrababu Naidu, Capital city, Amaravati opening, Telugudesam party

TDP leaders palns to boost the TDP karyakarthas in by the Inaugration of capital city Amaravati. Chandrababu Naidu giving main role to TDP leders in the inaugration

‘పచ్చ’గా అమరావతి శంఖుస్థాపన..?

Posted: 10/08/2015 10:48 AM IST
Tdp leaders for amaravati inauguration

స్వామి కార్యం స్వకార్యం.. రెండూ పూర్తి చెయ్యడం ఉత్తముల లక్షణం అని నానుడి. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిభ గురించి అందరికి తెలుసు. మరి ఆయన డైరెక్షన్ లో నడిచే తెలుగు తమ్ముళ్లు మాత్రం తక్కువ తిన్నారా ఏంటి..? వాళ్లు కూడా బాబు గారి మాస్టర్ మైండ్ కు తీసిపోనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే అమరావతి శంఖుస్థాపనకు ఏపి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అందుకు గాను కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రజలతో పాటు తమ పార్టీకి చెందిన వారిని ఇందులో భాగస్వాములుగా చేయాలని చంద్రబాబు నిర్ణయించారట. అందులో భాగంగానే శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలకు కీలకరోల్ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం అనుకుంటున్నట్లు తెలస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చరిత్రాత్మక ఘట్టంగా ఆవిష్కరించేందుకు టిడిపి శ్రేణులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తమ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో... శంకుస్థాపనకు వేల సంఖ్యలో అమరావతికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే  13జిల్లాల నుంచి పిడికెడు మట్టి తీసుకుని రావాలంటూ టిడిపి నేతలు పిపునిచ్చారు. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరిపే అవకాశం అరుదుగా లభించే అవకాశం కావటంతోపాటు... తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ... ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని నిర్మాణం జరుపుతుండటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణలు కూడా, పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భావిస్తున్నాయి.  తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనతను ఏకకాలంలో చాటడంతో పాటు.. అమరావతి కీర్తి ప్రతిష్టలు కూడా తెలుగుదేశం సార్టీకి ప్లస్ అయ్యేలా టిడిపి పక్కా ప్లాన్ వేస్తోంది. మొత్తానికి పార్టీ కార్యకర్తలకు అమరావతి శంకుస్థాపన బూస్టింగ్ ఇవ్వనుంది. మరి అమరావతి శంఖుస్థాపన వెనుక టిడిపి తమ్ముళ్ల ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Read Alsoఓపెనింగ్ అదిరిపోవాలంటున్న చంద్రబాబు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Amaravati  Iauguration  Chandrababu Naidu  Capital city  Amaravati opening  Telugudesam party  

Other Articles