what is the reason for Jagan and Ramoji Rao meeting

What is the reason for jagan and ramoji rao meeting

jagan, Ramoji Rao, JaganMohanReddy, YSRCP, Eendu, Jagan Met Ramoji Rao

YSRCP leader JaganMohan Reddy met Eenadu owner Ramoji Rao. Jagan Mohan Reddy. Jagan trying to do strike in Guntur. Jagan, Ramoji meeting is a hot topic in all parties.

రామోజీని జగన్ కలిసింది అందుకే..!

Posted: 09/25/2015 02:05 PM IST
What is the reason for jagan and ramoji rao meeting

బద్ద శత్రువులా అన్నంతగా మాటల తూటాలు పేలుస్తూ ఉండే వాళ్లు ఉన్నట్టుండి కలిసిపోతే అందరికి ఆశ్చర్యమే కదా. తాజాగా తెలుగు నాట కూడా అలాంటి వింతే ఒకటి జరిగింది. అది కూడా రాజకీయాలతో ముడిపడిన వ్యవహారం అయితే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. జగన్.. సాక్షి మీడియా ఓనర్ గా ఓ పార్టీకి అధినేతగా కొత్తగా ఎవరకీ పరిచయం అక్కర్లేదు. ఈనాడు మీడియా ద్వారా తెలుగు నాట ఎంతో పాపులారిటీని సంపాదించిన రామోజీ రావు గురించి కూడా ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అక్కర్లేదు. అయితే జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి రామోజీరావుకు అస్సలు పొసిగేది కాదు. అందుకే రాజశేఖర్ రెడ్డి రామోజీని ఒక్క రోజైనా జైలులో పెట్టాలని అనుకుంటూ ఉండేవారు. మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మాత్రం తన స్ట్రాటజీని మార్చారు. తాజాగా జగన్, రామోజీరావుతో భేటి పలు అనుమానాలు తావిస్తోంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో రెండు రోజుల్లో గుంటూరులో దీక్ష నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య భేటీ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. టిడిపి పార్టీకి వెన్నుదన్నుగా ఉండే రామోజీరావును ఎలాగైనా తనవైపు తిప్పుకోవడానికి జగన్ ప్రయత్నించారా అని కొంత మంది అనుకుంటుంటే..? జగన్ చేయబోయే దీక్ష మీద రామోజీతో చర్చించినట్లుమరికొందరు అనుకుంటున్నారు. మరి కొందరు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని.. తనకు పరోక్షంగా సహకరించాలని రామోజీని అడిగినట్లు పుకారు. కాగా కేవలం పర్సనల్ వర్క్ మీద మాత్రమే జగన్ రామోజీతో భేటీ అయ్యారని.. అంతే తప్పితే ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని వైసీపీ నాయకులు ప్రకటించారు. మరి నిజంగా రామోజీ జగన్ కు సహకరిస్తారా అనేది కాలమే చూపిస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  Ramoji Rao  JaganMohanReddy  YSRCP  Eendu  Jagan Met Ramoji Rao  

Other Articles