Galla Jayadev | TDP | Chandrababu Naidu

Ap cm chandrababu naidu may give priority and major duties to galla jayadev in tdp

Galla Jatadev, Chandrababu Naidu, Anaravati, AP, TDP, TelugudesCM party, Guntur, National Media, TDP spokesperson

AP CM Chandrababu naidu may give priority and major duties to Galla jayadev in TDP. Chandra babu naidu belives Galla Jayadev very much and he likely to give priority in the party.

గల్లా జయదేవ్ కు టిడిపిలో కీలక బాధ్యతలు..?

Posted: 08/06/2015 02:50 PM IST
Ap cm chandrababu naidu may give priority and major duties to galla jayadev in tdp

గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన అనంతరం విజయదశమి తరువాత జయదేవ్ కు పార్టీలోను, రాజధాని నిర్మాణంలోనూ కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సమాయత్తం అవుతున్నారని టీడీపీ వర్గాలు, గుంటూరు లోక్ సభా నియోజకవర్గంలోని ఆ పార్టీ ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

పరిశ్రమ, వ్యాపార రంగంలో మంచి దిట్ట అని పేరు తెచ్చుకున్న జయదేవ్ 2014లో సాధారణ ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు లోక్-సభా స్థానం నుంచి విజయం సాధించారు. జయదేవ్-కు రాజకీయంగా కలిసి వచ్చిన అంశాలు ఆయన కృషి, పట్టుదల, ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగలగడం జయదేవ్ కు బాగా కలిసివచ్చే అంశాలు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విదేశానికి వెళ్ళినా గల్లా జయదేవ్, పరకాల ప్రభాకర్, మంత్రి నారాయణ, సృజనా చౌదరి, సీఎం రమేష్-ను తప్పనిసరిగా వెంట తీసుకువెళుతుంటారు. వారిలో జయదేవ్ ఆయా దేశాల ప్రముఖులతో సంప్రతింపులు జరపడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే ఫండ్స్ విషయం, కార్యక్రమాలకు అయ్యే నిధుల సమీకరణను కూడా ఆయన ఎంతో సమర్థంగా నిర్వహిస్తారనే పేరుంది.  

టీడీపీకి అవసరమైన ఎన్నో సందర్భాల్లో జయదేవ్ నిధులు ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తాయి. ఎంతటి క్లిష్టమైన సమస్య ఎదురైనా జయదేవ్ చంద్రబాబు పక్కనే ఉండి సమర్థంగా పరిష్కరిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. చంద్రబాబు నాయుడికి ఎంత మంది అత్యంత సన్నిహితంగా ఉన్నా వారందరిలో జయదేవ్ స్థానం మాత్రం అందరి కన్నా ప్రధానమైనదని అంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో గల్లా జయదేవ్ కు విజయ దశమి తరువాత అటు పార్టీలోనూ, ఇటు నవ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లోనూ అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. గతంలో ఓటుకు నోటు వ్యవహారం మీద, గోదావరి మహా పుష్కరాల ఘటన మీద జాతీయ మీడియాలో కొందరు టిడిపి నేతలు మాట్లాడటానికి తడబడ్డారు. దాంతో చంద్రాబాబు జాతీయ మీడియాతో మాట్లాడాల్సి వస్తే గల్లా జయదేవ్ మాత్రమే మాట్లాడతారని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గల్లా జయదేవ్ కు ఇస్తున్న ప్రధాన్యత ఎంతో దసరా తర్వాత బహుశా తెలిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Galla Jatadev  Chandrababu Naidu  Anaravati  AP  TDP  TelugudesCM party  Guntur  National Media  TDP spokesperson  

Other Articles