Venkaiah Naidu about Centre's intervention

Venkaiah naidu about centre s intervention

Venkaiah Naidu about Centre's intervention, Venkaiah Naidu, Union Minister, Centre, Interstate Disputes, Centre’s interference, Andhra Pradesh and Telangana disputes

Union Minister M Venkaiah Naidu creates some confusion on Centre’s interference in the ongoing disputes between Andhra Pradesh and Telangana states.

కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యలు తికమకపెడుతున్నాయి

Posted: 06/24/2015 07:36 PM IST
Venkaiah naidu about centre s intervention

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఎంత మాటకారి అంటే.. ఆయన వ్యాఖ్యాలను అర్థం చేసుకోడానికి రాజకీయ నాయకులకే చాలా సమయం పడుతుంది. ఏ అంశంపైనా కానీ, అనర్గళంగా మాట్లాడగల మంచి వక్త కూడా. అయితే ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యాలలోని పరమార్థం మాత్రం తెలంగాణ ప్రజలను సందిగ్థంలోకి నెట్టాశాయి. దేశంలోని ఏ రాష్ర్టాల మధ్య వివాదాలు చెలరేగినా.. కేంద్రం జోక్యం చేసుకోదని, అది తెలుగు రాష్ట్రాలైతే నేమి, లేక మరోకటి అయితేనేమి అని ఆయన అన్నారు. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు విషయం బొధపడక తెలంగాణ ప్రజలు బుర్రలకు పదునుపెడుతున్నారు. అదేంటంటారా..?

సెక్షన్‌-8పై రెండు రాష్ర్టాలు కేంద్రాన్ని సంప్రదిస్తే ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పడమే తెలంగాణ అధికార, విపక్ష పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలను కూడా తికమక పెడుతోంది. ఓటుకు నోటు కేసు వ్యవహరామన్ని రోజుల మిన్నకుండిన వెంకయ్య.. ఇప్పడు సెక్షన్ 8 పై మాత్రం రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదిస్తే.. ఈ అంశాన్ని పరిశీలించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవినీతి బాగోతానికి తెరలేపిన టీడీపీకి వెనకేసుకువస్తున్న కేంద్రం.. మిత్రపక్షంపై చర్యలు తీసుకోకుండా.. సెక్షన్ 8 అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం.. కేంద్రం పక్షఃపాత ధోరణికి నిదర్శనమని తెలంగాణ వాదులు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Centre’s interference  Centre  Interstate Disputes  

Other Articles