Hours after Dayakar Reddy comments none was arrested in phone tapping case

Hours after dayakar reddy comments none was arrested in phone tapping case

2 IPS, 1 IAS, 2 T-leaders Arrest, Few Hours, Telangana, Kothakota Dayakar Reddy, prominent Telangana TDP leader, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Kothakota Dayakar Reddy sensational comments over cash for vote row

‘కోట’లు దాటుతున్నాయి..మేకపోతు గాంభీర్యమేనా..?

Posted: 06/17/2015 03:41 PM IST
Hours after dayakar reddy comments none was arrested in phone tapping case

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నీతి, నిజాయితీ అని ప్రతీ ప్రసంగంలోనూ అదరగోడుతున్న చంద్రబాబు.. అవినీతి కేసులో పికల్లోతు కూరుకుపోవడంతో.. ఆయనను రక్షించేందుకు రంగంలోకి దిగిన నేతలు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే వారు చేసిన ఏ ప్రకటన కూడా వాస్తవరూపం దాల్చడం లేదు. చంద్రబాబు వల్లించే నీతి, నిజాయితీ కన్నా, ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరంగా టీడీపీ నేతలకు కనబడటం గమనార్హం.

ఈ తరుణంలో తెరమీదకు వచ్చిన తెలంగాణ సీనియర్ నేతః కోత్తకోట దయాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గత కొన్ని రోజులుగా మౌనంగా వున్నది ఆధారాల సేకరణ కోసమేనంటూ.. చెప్పుకోచ్చారు. నిన్న రాత్రి హాడావిడిగా మీడియా సమావేశం పెట్టిన ఆయన తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొన్ని గంటల్లో సంచలనం జరగబోతోందని ప్రకటించారు. ఈ కేసులో మరో కోన్ని గంటల్లో కీలక మలుపులు తిరుగుతాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో మరో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని, వారందరి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక పరిణామంగా మారిన ఓటుకు నోటు కేసు మరో మలుపు తిరిగి అరెస్టుల వరకు వెళ్తుందని కోత్తకోట ప్రకటనతో రాష్ట్ర ప్రజలు నిద్రకు దూరం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్రం కదా దర్యాప్తు చేయాల్సింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఏం సంబంధం అని అలోచించిన పలువురు ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించారు. అయితే అధారాలు వున్నాయని, ఐఎఎస్, ఐపీఎస్ లతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు అరెస్టు అవుతున్నారని కొత్తకోట దయాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రకటించడంతో కొంత విశ్వసించిన ప్రజలు నిద్రభంగం కలిగినా.. అర్థరాత్రి పన్నెండు, ఒకటి వరకు టీవీ న్యూస్ ఛానెళ్లకు అతుక్కుపోయారు. మళ్లీ ఉదయం లేవగానే అలాంటేమి జరగలేదని తెలుసుకుని.. నిరుత్సాహానికి లోనయ్యారు. చివరకు దయాకర్ రెడ్డి కూడా బిస్కెట్ వేశాడని, ఇవన్నీ టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యమేనని తెలుసుకున్న ప్రజలు.. మాటలు కోటలు దాటు.. చేతలు గడప దాటవని నిట్టూర్చుతూ పనులలో నిమగ్నమయ్యారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : note for vote  Kothakota Dayakar Reddy  TDP  chandrababu  IPS  IAS  

Other Articles