ntr fans demand harikrishna interference on revanth case

Its time to hari krisha to respond on cash for vote issue

its time to hari krisha to respond on cash for vote issue, harikrishna interference, NTR followers, ntr son hari krishna, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan

ntr fans demand harikrishna interference on cash for vote issue, as party defames on bribery case

ముడుపుల కేసులో మౌనం ఎందుకు హరికృష్ణ..?

Posted: 06/08/2015 04:04 PM IST
Its time to hari krisha to respond on cash for vote issue

సమైక్య రాష్ట్రం పునర్విభజన నేపథ్యంలో అనేక సమస్యలు తెరమీదకు వస్తాయని తన అక్రోశాన్ని వెళ్లగక్కిన అన్న సర్గీయ ఎన్టీ రామారావు తనయుడు, ఎన్నికల ప్రచార రధసారధిగా వ్యవహరించిన హరికృష్ణ.. ఓటుకు నోటు కేసులో మౌనం వహించడం పట్ల అన్నగారి అభిమానుల్లో అసంతృప్తి వెల్లివిరుస్తుంది. తెలుగు దేశం పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇంకా అభిమానులు వున్నారంటే అది అన్నగారి చలవే. అలాంటి అన్నగారు స్థాపించిన టీడీపీ పార్టీకి అపఖ్యాతి మూటగడుతున్న తురుణంలో ఆయన వారసుడు.. నందమూరి హరికృష్ణ మౌనం వహించడం వారికి అగ్రహాన్ని తెప్పిస్తుంది.

రాష్ట్ర పునర్విభజన బిల్లుతో తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కులుగా చేశారని అవేదనను వ్యక్తం చేస్తూ.. తాను అందరి లాంటి వాడిని కాదని, తాను ఏం చెబితే దానికే కట్టుబడి వుంటానని తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. నిరూపించిన  హరికృష్ణ.. ఓటుకు నోటు కేసులో పార్టీ ఉనికికే ప్రమాదం పోంచి వున్న తరుణంలో.. ఇంకా కిమ్మనకుండా వుండడాన్ని అన్నగారి అభిమానులు అక్షేపిస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి పడిపోతున్నా... నందమూరి వారసులు కానీ, హరికృష్ణ కానీ స్పందించక పోవడం అన్నగారి అభిమానులకు రుచించడం లేదు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరు చెబితే.. అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ.. అన్న అరోపణలు తమ భుజాలపై వేసుకోవాల్సి పరిస్థితి తెలుగు తమ్ముళ్లకు ఏర్పడింది. అన్నగారిపై అభిమానంతో తమ తాత, తండ్రుల ప్రోత్భలం, ప్రోత్సాహంతో రాజకీయాలు తెలియకున్నా కేవలం తెలుగుదేశం పార్టీపై మమకారంతో రంగప్రవేశం చేస్తున్న తమ్ముళ్లను పట్టించుకునేదెవ్వరు..? వారికి అండగా, వుండి మేమున్నాం.. మీకేం కాదు అన్న భరోసా ఇచ్చేదెవరు..? ఇప్పటికైనా మేలుకోలేని పార్టీ క్రీయాశీలక నేతలు, నందమూరి వారసులు మేలుకోలేని పక్షంలో ఇక తెలంగాణలో టీడీపీ నేతలను వేళ్లపై లెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  TDP  Harikrishna  jr ntr  silence  cash for vote scam  

Other Articles