former minister kavuri sensational comments on UPA

Kavuri sambasiva rao criticises upa ministers himself being a minister

former minister kavuri sensational comments on UPA, former minister kavuri sambasiva rao, kavuri sambasiva rao, kavuri sensational comments on UPA regime, bjp janakalyan parv, vizinagaram, sonia gandhi, rahul gandhi, chiranjeevi, raghuveera reddy

former minister kavuri sambasiva rao sensational comments on UPA regime at janakalyan parv in vizinagaram

ఎటెట్టా కావూరి.. బ్లాక్ మెయిలింగ్ తో మంత్రి పదవులా.?

Posted: 05/27/2015 05:37 PM IST
Kavuri sambasiva rao criticises upa ministers himself being a minister

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఇవాళ విజయనగరంలో చేసిన సంచలన వ్యాఖ్యలకు ఆయన గతాన్ని తిరగతోడేలా వున్నాయి. గత పదేళ్ల యూపీఏ హాయంలో పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడంతో పాటు ఆయన కొంత కాలం పాటు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్ల పాటు పార్టీలో కోనసాగిన అనంతరం, అధికారం వీడిపోయిన తరువాత సరిగ్గా ఎన్నికల ముందు బీజేపిలో చేరిన కావూరి అప్పటి తన ప్రభుత్వంలోని సహచర మంత్రులపైన చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వినబడుతున్నాయి.

గతంలో 10 ఏళ్లు పాటు సాగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని.. ప్రస్తుతం ఎన్డీఏ హయాంలోని మోదీ ప్రభుత్వంలో అలాంటి మంత్రులు లేరని కావూరి వ్యాఖ్యనించడంపై కాంగ్రెస్ నేతలు కుడా అదేస్థాయిలో రుసరుసలాడుతున్నారు. యూపీఏ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తరువాత.. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం పార్టీలో సంభవించిన మార్పుల నేపథ్యం ఒక వైపు, రాష్ట్ర పునర్విభజన కోసం ఉద్యమాలు మరోవైపు కొనసాగుతున్న తరుణంలో కావూరి తనకు మంత్రి పదవి కావాలని పార్టీ అధిష్టానంపై అలిగి.. పార్టీ వీడిపోతానని బ్లాక్ మెయిల్ చేసిన విషయాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.

తనకు మంత్రి పదవి రాకపోవడంతో అలిగిన కావూరిని అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆయనను బుజ్జగించారు. ఈ తరుణంలో ఆయన మంత్రి పదవినిస్తామని అప్పటి యూపీఏ కన్వీనర్ సోనియాగాంధీ ఆయనకు మాట ఇచ్చిరు. దీంతో ఆయన 2013 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ విషయాన్ని మర్చిపోయి యూపీఏ హయాంలోని కేంద్ర మంత్రులపై బురద జల్లేందుకు ఎందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు, మంత్రి పదవి రాకముందు 2009 డిసెంబర్ లో ప్రత్యేక వాదానికి వ్యతిరేకంగా పావులు కదిపిన కావూరి.. మంత్రి పదవి వచ్చిన తరువాత 2013లో సమైక్య వాదం కోసం ఇంకా తానోక సర్పంచ్ స్థాయి వ్యక్తిలా ఉద్యమాలు చేయాలా..? అంటూ ప్రశ్నించిన వైఖరిని కూడా వారు ఊటంకిస్తున్నారు. మోడీ పంచన చేరిన వారిలో అనేక మంది బ్లాక్ మెయిల్ రాజకీయ నేతలు వున్నారని విమర్శిస్తున్నారు. కావూరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలా మారారని, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavuri sambasiva rao  janakalyan parv  sensational comments  UPA regime  

Other Articles