Communal | CPI | CPM | Commrade

Communal politics in cpm and cpi parties

cpi, cpm, narayana, raghavulu, ap, telangana, erragenda,

communal politics in cpm and cpi parties. The Cpm, Cpi partys maintaing some morals and values from the begiing. But now party getting communal colour. Parties are leading by only kammas and kapu comminities.

కమ్మ, రెడ్డిలే కామ్రేడ్ లు.. ఎర్రదళంలో కుల రాజకీయాలు

Posted: 04/16/2015 04:29 PM IST
Communal politics in cpm and cpi parties

కామ్రేడ్ అంటే మామూలు జనాలకు ఓ గౌరవం ఉంది. కామ్రేడ్ అంటే అన్నలుగా ఓ గుర్తింపు ఉంది. సామ్యవాదం, స్వేచ్ఛ అంటే లెక్చర్లు ఇచ్చే కామ్రేడ్ లు కుల రాజకీయాల్లో మునిగిపోతున్నారు. ఎంతగా అంటే అసలు పార్టీలో వారికి మాత్రమే ఆధిపత్యం లభిస్తోంది. మరి ఎప్పుడూ నీతులు చెప్పే కామ్రేడ్ లు ఎందుకిలా చేస్తున్నారూ అంటే మాత్రం సమాధానం లేదు. ఎంతో కాలంగా పోరాటాల బాట పట్టి కార్మిక, కర్షకులకు బాసటగా నిలుస్తున్నారు కామ్రేడ్ లు. కానీ మామూలు పార్టీల్లో లానే అందులోనూ కుల రాజకీయాలు నడుస్తున్నాయట. కేవలం కమ్మ, రెడ్డి వర్గాలు మాత్రమే రెండు ఎర్రపార్టీల్లో జెండా ఎగరేస్తున్నాయి.. చక్రం తిప్పుతున్నారని వార్తలు వస్తున్నాయి.

సిపిఐ, సిపిఎం లో కీలక నేతలుగా ఎదిగిన రాఘవులు, నారాయణలు కూడా ఈ సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం యాదృచ్చికమో లేక ఎర్రపార్టీల్లో జరుగుతున్న కుల రాజకీయాలకు నిదర్శనమో తెలియాలి. అయితే నారాయణ, రాఘవుల కంటే ముందు ఎర్రపార్టీల్లో ఎంతో మంది కార్యకర్తులు, పార్టీ ముఖ్యనేతలు ఉన్నా కేవలం వీరు మాత్రమే ఎందుకు ఎదిగార అనే ప్రశ్న కూడా ఇందుకు నిదర్శనం. మరి మిగిలిన వారు ఎందుకు వెనుకబడ్డారు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలు. మరోనేత సురవరం కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతే అనే విషయం కుల రాజకీయాలకు ఎర్రజెండాల పార్టీలు అతీతం కావు అన్న వాదనకు బలాన్నిస్తున్నాయి.

తాజాగా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ భార్య బృందా కారత్ కు కుల రాజకీయాల గురించి విలేకరులు వేసిన ప్రశ్న ఆమెను ఇబ్బంది పెట్టింది. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే పార్టీ పొలిట్ బ్యూరోలో ఎంత మంది దళితులకు స్థానమిస్తారో చెప్పాలన్నది ప్రశ్న. దాంతో కంగుతిన్న బృందా కారత్ గొంతెండిపోయింది. తేరుకొని పొలిట్ బ్యూరోలో ఎవరూ దళితులు లేరు కానీ జాతీయ కార్యవర్గంలో మాత్రం ఉన్నారు అని అసలు విషయాన్ని వెల్లడించారు. మొత్తానికి విలువల గురించి గంటల కొద్ది లెక్చర్లు ఇచ్చే ఎర్రకండువాలు కూడా కులాలను బట్టి చేరతాయన్నది సారాంశం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cpi  cpm  narayana  raghavulu  ap  telangana  erragenda  

Other Articles