bjp central ministry second term on congress governors | Governor Narasimhan

Bjp central ministry second term on congress governors

governor narasimhan, narasimhan news, narasimhan updates, narasimhan news, bjp central ministry, central government, bjp second term governors, bjp party controversy, governor narasimhan gossips

bjp central ministry second term on congress governors : According to the political sources the news is going viral that bjp government will remove narasimhan from governor post soon.

గవర్నర్ పోస్ట్ నుంచి నరసింహన్ ‘ఊస్ట్’!

Posted: 04/03/2015 12:15 PM IST
Bjp central ministry second term on congress governors

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా బాధ్యతలు చేపడుతున్న నరసింహన్ కు పదవిగండం వున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న లోపాలను సవరించడంలో నరసింహన్ ఫెయిల్ అవుతున్నారని, ఇరురాష్ట్రాల సమన్వయతను సమకూర్చడంలో ఈయన వెనుకబడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని వార్తలొస్తున్నాయి.

ఇదిలావుండగా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నర్ పదవుల్లో కొనసాగిన మాజీ కాంగ్రెస్ నేతల్ని తొలిగించిన విషయం తెలిసిందే! తమవాళ్లను ఆ పదవుల్లో కూర్చోబెట్టేందుకు అప్పట్లో కమలనాథులు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం గవర్నర్ పదవుల మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ తయారుచేసుకున్న రెండో విడతలో ఆంధ్ర, తెలంగాణ గవర్నర్ నరసింహన్ కూడా వుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలిదశలో కాంగ్రెస్ ముఖ్యనేతల్ని ఇంటిదారి పట్టించిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడతలో భాగంగా కాంగ్రెస్ సానుభూతిపరులుగా పేరొంది, గవర్నర్ పదవులు పొందిన వారిని సాగనంపే ఏర్పాటు చేస్తోందట!

అయితే... ఇక్కడ గవర్నర్ నరసింహన్ ను తొలగించే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ హయాంలో వున్నప్పుడు అప్పటి మంత్రులకు ఎంత విధేయుడిగా నరసింహన్ పనిచేశారో.. అలాగే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటివారితో అంతే విధేయతను చూపుతున్నారు. అందరితోనూ కలిసిమెలిసి తన పదివిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతారా..? లేదా..? అన్నది వేచి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor narasimhan  bjp central government  political gossips  

Other Articles