jagan | maa | elections

May jagan trying to settele the maa elections

maa, movie artist association, jayasudha, rajendraprasad, ys jagan, elections

one hot gossip is in popular on the maa elections. ys jaganmohan reddy is trying to settele the maa elections. between jayasudha and rajendraprasad the maa elections going to get the colour of political partys.

'మా' ఎన్నికల్లో జగన్ సెటిల్మెంట్..?

Posted: 03/26/2015 12:00 PM IST
May jagan trying to settele the maa elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సహజనటి జయసుధలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మా ఎన్నికల్లో కొత్తగా రాజకీయ రంగు రాసుకుంటోంది. గతంలో పదవి వెలగబెట్టిన వారే మరోసారి తమ ప్రభావాన్ని చూపించాలని అనుకుంటున్నారు. అందుకే వెనక నుండి రాజకీయాలను నడపాలని ప్రయత్నిస్తున్నారు.  ఓటింగ్ లో జరిగే అవకతవకలపై రెండు వర్గాలు విమర్లు చేసుకుంటున్నాయి. అయితే సెల్ ఫోన్లకు, నోట్ల కట్టలకు కళాకారులు అమ్ముడు పోయే స్థితిలో లేరని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో నిన్నటి దాకా ఉన్న వాతావరణాన్ని ఈ ఎన్నికలు పాడు చేశాయని అందరూ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'మా'లో రాజకీయ నాయకుల జోక్యం తీసుకురావోద్దని జయసుధ ఆరోపణలు చేయడం, వాటిని రాజేంద్ర ప్రసాద్ ఖండించారు.  జయసుధ వర్గం బెదిరింపులకు పాల్పడుతుందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో  షికారు చేస్తోంది. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మా ఎన్నికలలో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారట. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో జయసుధ రాజకీయాలలో అడుగుపెట్టారు. కానీ, ప్రస్తుతం ఆమెకు మద్దతునిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంపి. మురళీ మోహన్. అలాంటప్పుడు ఆమె జగన్ మద్దతు ఎందుకు కోరతారు అనేది  ప్రశ్న. మరోవైపు గెలవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడానికి జయసుధ సిద్దంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ వెనుక మురళీమోహన్ ఉన్నారు కనుక రాజేంద్ర ప్రసాద్ జగన్ వద్దకు వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఎవరికి మద్దతుగా జగన్ రంగంలోకి దిగారు అనే విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి ఎన్నికలు అంటే ఎంత రసవత్తరంగా సాగుతాయో ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలను చూస్తేనే అర్థమవుతుంది. మరి జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది తెలియడం లేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa  jayasudha  rajendraprasad  ys jagan  elections  

Other Articles