Few tdp mla s ready to join in trs

tdp mla, trs mla, tdp mlas in telangana, total tdp mlas in telangana, total trs mla in telangana, trs party, tdp mla to trs

few tdp mlas ready to join in trs, they are taking some promises from kcr

ఇంకొందరు టిడిపి ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దం!!

Posted: 12/26/2014 05:33 PM IST
Few tdp mla s ready to join in trs

ఇప్పటికే టిడిపి ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. అందులో ఒకరికి మంత్రి పదవి కూడా అధికార ప్రభుత్వం కట్టబెట్టింది. ఇంకొ ఎంఎల్ఏకు మరో ముఖ్య పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళి ఇంకొందరు ఎం ఎల్ ఏ లు టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు బయట కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ ఎంఎల్ఏ లు కెసిఆర్ నుండి ఏదోక హామీ తీసుకొనే పార్టీ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ఇప్పటికే కొన్ని తాయిలాలు అందజేస్తామని తెరాస వర్గాలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

తెలంగాణలో ఇంతకాలం టిడిపి కి గట్టిగా నిలబడిన వారిలో ఒకరైన సత్తుపల్లి  టిడిపి ఎంఎల్ఏ ఎస్.వెంకట వీరయ్య రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారన్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వెంకట వీరయ్య, అలాగే రాజేంద్ర నగర్ టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు టిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందంటూ వార్తలు రావడం ఆరంభమైంది.ప్రకాష్ గౌడ్ గతంలో ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్లి వెనక్కి వచ్చారు.ఆయన మళ్లీ  తెరాసలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. వెంకట వీరయ్య పరిస్థితి కొంత ఇబ్బందిగామారింది.ఆయన రాజకీయంగా గురువు వంటి తుమ్మల నాగేశ్వరరావు టిడిపిని వీడి,టిఆర్ఎస్ లోకి వెళ్లడం , మంత్రిగా కూడా నియమితులవడం ఆయన కు సమస్య కావచ్చని అంటున్నారు.సత్తుపల్లి రిజర్వు కాకముందు తుమ్మల నాగేశ్వరరావు ఆ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించారు. ఆ తర్వాత వెంకట వీరయ్యకు అవకాశం వచ్చింది.ఒక దశలో వీరయ్య టిఆర్ఎస్ లోకి వెళ్లాలని ఆలోచన చేసినా,స్థానికంగా ఆ పార్టీకి పట్టు లేకపోవడంతో టిడిపిలోనే ఉండిపోయారు.కాని ఇప్పడు తుమ్మల మంత్రి కావడంతో ఏమి చేయాలో వీరయ్యకు పాలుపోవడం లేదు.తుమ్మల వెంట వెళ్లకపోతే,నియోజకవర్గంలో అబివృద్దికిగాని, ఆపీసర్ల నియామకంలోకాని సమస్యలు తప్పవని ఆయన అనుచరులు బావిస్తున్నారు.దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్దం కాక అనిశ్చితిలో పడ్డారని అంటున్నారు.

ఏది ఏమైనా కొందరు టిడిపి ఎంఎల్ఏ టి ఆర్ ఎస్ లో చేరటం ఖాయమని పలు తెరాస వర్గాలు చర్చించుకుంటున్నాయి. టిడిపి ఎం ఎల్ ఏ లు చేరిది తమకు వచ్చే పదవులు వాళ్ళు ఎక్కడ లాక్కు పోతారు భయం కొందరి తెరాస నేతల్లో కూడా పట్టుకుందని మరి ఈ పరిణామం దేనికి దారి తీస్తుంది కొన్ని తెరాస వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాని టిడిపి ఎం ఎల్ ఏ లు గనుక తెరాస లో చేరితే మున్ముందు టిడిపి లో ఒక్క ఎం ఎల్ ఏ కూడా ఉండకపోవచ్చని కొన్న్ని వర్గాలు గుగుసలాడుకుంటున్నాయి.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp party mla  trs party  k chandra shekar rao  

Other Articles