Telangana government on heritage milk

heritage milk quality, heritage milk products, heritage stores in telangana andhrapradesh, nara lokesh assets, nara lokesh bhuvaneswari heritage, telangana government on heritage, chandrababu assets, latest news tags : heritage, chandrababu, telangana, latest news

telangana government on heritage milk : telangana government put eye on chandrababu family running heritage milk says that there are so many issues allegations on heritage. in telangana assembly trs members alleges heritage milk not maintaining quality tdp objects this

బాబు కుటుం ఆస్తిపై తెలంగాణ సర్కారు కన్ను

Posted: 11/12/2014 01:02 PM IST
Telangana government on heritage milk

రాజకీయాలు ఎంతవరకైనా దారి తీస్తాయి. ప్రత్యర్ధిని దెబ్బకొట్టడానికి ఉన్న ప్రతి మార్గాన్ని ఉపయోగించుకోవటం నేతలకు కొత్తేం కాదు.. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు నిత్య పోరుగా మారింది టీడీపీనే. పసుపు చొక్కా నేతలు గులాబీపై రోజూ గుస్సా అవుతున్నారు. ఏదో ఒక విషయం తీసుకుని విమర్శిస్తున్నారు. దీంతో కుదిరితే పార్టీ పరంగా కలిసివస్తే ప్రభుత్వ పరంగా టీడీపీకి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఎందుకు చెప్తున్నామంటే.., తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా పాల కల్తీపై చర్చ జరిగింది. కల్తీ వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని దీన్ని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని అన్ని పార్టీల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి మాట్లాడిన ఏనుగు రవీందర్ రెడ్డి, హెరిటేజ్ సంస్థ పాలపై గతంలో చాలా కధనాలు వచ్చాయనీ, దీన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సభలో టీడీపీ-టీఆర్ఎస్ మద్య గందరగోళంకు తెరలేచింది. తమ పార్టీని దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అటు పాల కల్తీపై రాజకీయం చేయకుండా ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాని హెరిటేజ్ పై చర్యలు తీసుకోవటం సరికాదని చెప్పలేదు. ప్రభుత్వం స్పందించి హెరిటేజ్ పై ఆకస్మిక దాడులు, వరుస తనిఖీలు చేపడితే.., ఎక్కడ చిన్నలోపం దొరికినా అది చాలు బాబును బుక్ చేయటానికి అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో ప్రైవేటు డెయిరీ సంస్థల్లో హెరిటేజ్ అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కన్ను ఈ సంస్థపై పడితే టీడీపీకి రాజకీయంగా ఎంతవరకు ఇబ్బంది ఉంటుందో చెప్పలేము కాని.., ఆర్ధికంగా చంద్రబాబు ఫ్యామిలికి మాత్రం నష్టం తప్పదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో త్వరలో తెలియనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  heritage milk  telangana government  telangana assembly  

Other Articles