Dikkulu choodaku ramayya movie story

dikkulu choodaku ramayya, dikkulu choodaku ramayya movie, dikkulu choodaku ramayya latest news, dikkulu choodaku ramayya gossips, dikkulu choodaku ramayya story, dikkulu choodaku ramayya release date, dikkulu choodaku ramayya movie rating, dikkulu choodaku ramayya release, tollywood, latest movies, tollywood latest movies, telugu movies

dikkulu choodaku ramayya movie story leaked by movie unit people some of them says that its not actual story : telugu movie fans shocked by dikkulu choodaku ramayya story line and theme of the story

రామయ్య కధ ఇదేనా !.. అయ్యో !!

Posted: 10/08/2014 02:45 PM IST
Dikkulu choodaku ramayya movie story

హీరో చిన్నవాడయినా బ్యానర్ పెద్దది కావటంతో ‘దిక్కులు చూడకు రామయ్య’పై భారీ అంచనాలున్నాయి. అయితే కధ బయటకు రావటంతో ఇంతేనా సినిమా.., ఇదేం కధ అనకుంటున్నారంతా. అయితే ఫిలింనగర్ లో విన్పిస్తున్న ఈ సినిమా కధ ఎంతవరకు నిజమో ఎవరూ ఇప్పుడే చెప్పలేరు కాని.., అందరి నోట్లో నానుతున్న కధను చూస్తే మాత్రం అంచనాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మీరో నాగశౌర్య, సన, అజయ్, ఇంద్ర.జ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ లోపు ఇలా కధ బయట అందరి నోటా వినబడుతోంది.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కధను ఓ సారి చూస్తే..., తండ్రి పాత్రలో నటించిన అజయ్ కి చిన్న వయస్సులోనే ఇంద్రజతో వివాహం అవుతుంది. ఆమె ఓ కొడుకుని కన్న తర్వాత చనిపోతుందట. ఆ తర్వాత అజయ్ పూల రంగడిలా తిరుగుతాడు. ఈ క్రమంలో తనకంటే చాలా చిన్న వయస్సు గల ఓ అమ్మాయి వెంట పడుతుంటాడు. ఇంతవరకు సినిమా అలా ఉంటే.. ఇక్కడ ట్విస్ట్ పెట్టారు. అదేమంటే.., అజయ్ వెంట పడుతున్న అమ్మాయినే హీరో శౌర్య ప్రేమిస్తాడు.., ఇద్దరూ పెళ్ళి చేసుకుందాము అనుకుంటారు కూడా. ఇక్కడ శౌర్య ఎవరో కాదు అజయ్ కొడుకు. విషయం తెలిసిన అజయ్ ఏం చేస్తాడు.., తండ్రి వ్యవహారంపై శౌర్య ఎలా స్పందిస్తాడు అనేది మిగతా కధ అని అంటున్నారు. ఇదే కధ అని సినిమా యూనిట్ వర్గాలు చెప్పకపోయినా.., బయట ప్రచారం జరుగుతోంది. ఈ కధను విన్నవారంతా ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలేదే.., అంటున్నారు. కాని తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని కోరుకోవటంను ప్రేక్షకులు జీర్ణించుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాత సాయి కొర్రపాటి ‘దిక్కులు చూడకు రామయ్య’ ను నిర్మించారు. హిట్ సినిమాలు వచ్చిన ‘వారాహి’ బ్యానర్ పై సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు పెట్టుకున్నారంతా. సినిమాకు కీరవాణి అందించిన సంగీతంకు మంచి స్పందన వచ్చింది. ఇక సెన్సార్ బోర్డు ‘దిక్కులు చూడకు రామయ్య’కు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కధపై నిర్మాత సాయి మాట్లాడుతూ.., డైరెక్టర్ చెప్పిన కథ కొత్తగా ఉందన్నారు. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పారు. ‘వారాహి’ బ్యానర్ హిట్ సినిమా లిస్ట్ లో ‘దిక్కులు చూడకు రామయ్య’ కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dikkulu choodaku ramayya  tollywood  story  movie news  

Other Articles