Six tdp mlas secretly met in hyderabad

tdp, telangana tdp, telugudesam party, telangana telugu desam party, ttdp leaders, trs leaders, congress, telangana, latest news, tdp mlas joins trs, tdp mlas list, trs mlas list, telangana mlas partywise list, telangana mlas district wise list, politics, kcr, trs leaders, m kishan reddy, talasani srinivas yadav, teegala krishna reddy, madhavaram krishna rao, prakash goud, sayanna

six telugu desam mlas met secretly in hydeabad to discuss about their political future : suspected mlas to join in trs met secretly in banjarahills to discuss about recent trends

కారు ఎక్కేది ఈ ఆరుగురేనా...? `

Posted: 10/08/2014 07:58 AM IST
Six tdp mlas secretly met in hyderabad

సైకిల్ దిగి కారు ఎక్కే వారి లిస్ట్ దాదాపుగా ఖరారయింది. టీఆర్ఎస్ ప్లీనరి సమావేశాలు వేదికగా పార్టీ మారేందుకు ఆరుగురు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన రహస్య భేటితో టీడీపీ నుంచి పార్టీ వీడే వారి జాబితాపై కాస్త క్లారిటీ వచ్చింది. హైదరాబాద్; రంగారెడ్డి జిల్లాలను ప్రధానంగా టార్గెట్ చేసిన కేసీఆర్.., ఈ రెండు జిల్లాలనుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు పలువురు పార్టీ మారేందుకు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. మిగతావారు వెళ్ళాలా.., వద్దా..? అనే డోలాయమానంలో తేలుతున్నారు. వీరి సందిగ్ధతలకు స్వస్తి పలికే ఉద్దేశ్యంతోనే మంగళవారం రోజు ఆరుగురు టీడీపి ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యారు.

జూబ్లిహిల్స్ లోని ఓ ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సాయన్న, ప్రకాష్ గౌడ్; మాధవరం కృష్ణారావు, అరికెలపూడి గాంధీ సమావేశం అయినట్లు తెలుస్తోంది. వీరి భేటిలో ప్రధానంగా పార్టీ మారటంతో పాటు తాజా రాజీకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం వస్తోంది. పార్టీ మారితే వచ్చే ప్రయోజనాలతో పాటు.., తర్వాతి పరిణామాలపై కూడా వీరంతా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలు, కార్యకర్తల్లో పార్టీ మారటంపై వ్యక్తం అవుతున్న అభిప్రాయాలపై కూడా ప్రస్తావించారు.

ఇక పార్టీ మారితే అంతా కలిసి మూకుమ్మడిగా కారు ఎక్కాలా.. లేక ఒక్కొక్కరుగా పార్టీ మారాలా అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో భారీగా టీడీపీ నుంచి వలసలను చూస్తారు అని గులాబినేతలు ప్రకటించగా.., తాజా సమావేశంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే వీరు పార్టీ వీడుతారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అనేది మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటి రాలేదు. అటు వీరిని బుజ్జగించేందుకు ఇప్పుడు సైకిల్ నాయకత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp  trs  politics  telangana  latest news  

Other Articles