Paneer selvam in tension of loosing his power

jayalalithaa, agrahara jail, paneer selvam, palani swamy, aiadmk, karnataka high court

jayalalithaa disagrees for mulaakhat with paneer selvam

పన్నీరు సెల్వం పదవికి దినదిన గండం..

Posted: 10/06/2014 10:32 AM IST
Paneer selvam in tension of loosing his power

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత, తన అనుంగు శిష్యుడు పన్నీర్ సెల్వంతో ముఖాలాత్ అవ్వడానికి ఇష్టపడలేదు. తమిళనాడు ముఖ్యమంత్ర హోదాలో బెంగళూరు పరప్పనా అగ్రహార జైలు వద్ద గంటలకొద్ది పడిగాపులు కాసినా.. అమ్మ కరుణించలేదు. ఇక చేసేది లేక తమిళనాడుకు తిరుగు పయనం అయ్యారు పన్నీరు సెల్వం. ఇంతకీ ఏం జరిగింది.. ఎంజీ రామచంద్రన్ సమయం నుంచి తనకు నమ్మకస్తుడుగా వున్న పన్నీరు సెల్వంపై జయలలితకు కోపం ఎందుకు వచ్చింది.

ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో జయలలిత జైలుపాలయ్యారు. ఈ తరుణంలో కోర్టు తీర్పును గౌరవిస్తూ.. అమ్మ తన ముఖ్యమంత్రి పదవితో పాటు.. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. కోర్టు బెయిల్ నిరాకరించడంతో జైలులోనే వున్న జయలలిత.. ఎవరికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెడుతుందా..? అని అంతా ఉత్కంటగా ఎదురుచూశారు. అంతలోనే అనూహ్య నిర్ణయం. అనుంగు అనుచరుడు పన్నీర్‌సెల్వంను అమ్మ ముఖ్యమంత్రిగా ఎంపికచేశారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం. సీఎంగా ప్రమాణం చేసిన పన్నీర్‌ సెల్వం వెక్కివెక్కి ఏడ్చారు. తామూ అమ్మ అనుచరుల మేనన్న భావన కల్పించేందుకు మిగిలిన మం త్రులు పోటీలు పడ్డారు. ఈ సన్నివేశం దేశవ్యాప్తంగా రక్తి కట్టింది. ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్..

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజున మంత్రులను వెంటబెట్టుకుని సెల్వం అమ్మ దగ్గరికి వెళ్లారు. అయితే అమ్మ నిరాకరణతో నిరాశతో చెన్నైబాట పట్టక తప్పలేదు. తాను ఎంపిక చేసిన వ్యక్తిని కలిసేందుకు జయలలిత ఎందుకు నిరాకరించారు? అని మీడియా మదిలో అనేక ప్రశ్నలు.. అయితే ఈ మిస్టరీ వీడింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం పన్నీర్‌ సెల్వం సహా మంత్రులు కార్చిన కన్నీరంతా గ్లిజరిన్‌ చుక్కల ప్రభావమేనట. పదవీ గండం పొంచివుందనుకున్న సమయంలో పదవీ పోలేదు సరికదా.. ఏకంగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి పదవి దక్కినందుకు సెల్వం బృందం రాత్రంతా సంబరాల్లో మునిగారట. మంత్రుల బృందంతో పాటు కుటంబ సభ్యులు, బంధువులు అందరూ సెల్వం ఇంట్లో పార్టీ చేసుకున్నారట.

తెల్లవారగానే అమ్మకు బంటులం అంటూ జయలలిత వద్దకు బయలుదేరారు. ఈ కొత్త కోణం తెలియడంతోనే ములాఖత్‌కు జయలలిత నిరాకరించారని తెలుస్తోంది. తన నెట్‌వర్క్‌ ద్వారా విషయం తెలుసుకున్న జయలలిత, మంత్రివర్గంలో తనకు అ త్యంత నమ్మకస్తుడైన పళనిస్వామితో ములాఖత్‌కు అంగీకరించారు. అంతే కాక విషయాన్ని ప్రస్తావించి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ కారణంగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా గేటు బయటే వేచి చూసిన పన్నీర్‌సెల్వంపై జయలలిత ఏమాత్రం కనికరం చూపలేదు. పళనిస్వామితో అమ్మ ములాఖత్‌ అయ్యారని తెలియడంతో సెల్వం సహా మంత్రులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారట. అమ్మ ఆగ్రహిస్తే తమ పదవి ఎక్కడ ఊడుతుందోననే భయం వెన్నాడుతోంది మరి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president  pranab Mukharjee  chandrababu  KCR  governer  narasimhan  bakrid  greetings  

Other Articles