Telangana cabinet without women

kcr, telangana, kcr cabinet, telangana cabinet, telangana mla list, telangana mp list, mla mp names, telangana news, batukamma, batukamma funds, batukamma songs, batukamma folk songs, telangana songs, latest news, shabbir ali

telangana cabinet formed without woman minister in the whole state political parties taking a dig on government for this : kcr honours batukamma that's ok but what about the womans honorary in the cabinet questions shabbir ali

కేసీఆర్ కేబినెట్లో నో ఉమెన్.. వై..?

Posted: 09/23/2014 09:07 AM IST
Telangana cabinet without women

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కాని తెలంగాణ కేబినెట్ లో కనీసం ఒక్కశాతం కూడా వారికి స్థానం లేకపోయింది. కనీసం ఒక్క మహిళ కూడా లేకండా తెలంగాణ కేబినెట్ కొనసాగుతోంది. మహిళలను గౌరవిస్తామని.., వారికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి గొప్పగా చెప్తున్నారు. కాని పదవుల విషయానికి వచ్చే సరికి వారిని పక్కకుపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ లేవనెత్తిన ఈ ప్రశ్నతో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో ఆడవారు జరుపుకునే బతుకమ్మకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది బాగుంది కానీ.., కేబినెట్ లో మాత్రం వారికి ప్రాధాన్యత లేదు ఎందుకు? అని షబ్బీర్ ప్రశ్నించారు.

మాజిమంత్రి ప్రశ్నను ఓ సారి పరిశీలిస్తే.. నిజంగా ఎందుకు తెలంగాణ కేబినెట్ లో మహిళా మంత్రి లేదు అనే ప్రశ్న మనకూ వస్తుంది. ఇప్పటివరకు 11మంది మంత్రులతో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.  టీఆర్ఎస్ నుంచి పోటి చేసి గెలిచిన మహిళల్లో నల్గొండ నుంచి సునీత, అదిలాబాద్ నుంచి లక్ష్మి, కరీంనగర్ నుంచి శోభ, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ ఉన్నారు. వీరిలో ఇప్పటికే పద్మకు డిప్యూటి స్పీకర్ పదవి ఇచ్చారు. ఇది కేబినెట్ హోదాతో సమానం. ఇక సామాజికవర్గాల వారిగా తీసుకుంటే శోభకు మంత్రి పదవి ఇవ్వవచ్చు. అయితే సీనియారిటీ ప్రకారం సునీతకు పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కాని ఏది జరగలేదు.

ఇందుకు కారణం మంత్రి పదవులు వచ్చినవారంతా తొలినుంచి కేసీఆర్ వెంట నడిచిన వారు., సామాజిక వర్గాల సమీకరణాల వల్ల పదవులు వచ్చిన వారున్నారు. అందువల్లే మహిళలకు మంత్రి పదవి రాలేదని అంటున్నారు. అయితే కొందరు మహిళా నేతలు కూడా తొలినుంచి తెలంగాణను నమ్ముకుని ఉన్నారు. వారికి పదవులు ఇవ్వటం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానంగా..కేబినెట్ విస్తరణలో మహిళా మంత్రులకు చోటు కల్పిస్తామని చెప్తున్నారు. చూడాలి మరి తెలంగాణ తొలి మహిళా మంత్రి ఎవరు అవుతారో..?

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cabinet  woman minister  batukamma  telangana  

Other Articles