The dangerous situation is came for pawan kalyan to improve his party

pawan kalyan, pawan kalyan janasena, tdp party, chandrababu tdp, narendra modi, bjp narendra modi, pawan kalyan chandrababu modi

the dangerous situation is came for pawan kalyan to improve his party : the power star and president of janasena party pawan kalyan is planning to withdrawn his support from bjp tdp parties to improve his own party

బాబు, మోడీలకు పవన్ చెక్ పెడతాడా..?

Posted: 08/23/2014 01:16 PM IST
The dangerous situation is came for pawan kalyan to improve his party

సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, మోడీలకు మద్దతుగా ప్రచారం చేసిన జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు వారిద్దరికి చెక్ పెట్టడానికి సిద్ధమవుతున్నారా..? ఆ రెండు పార్టీలను గెలిపిస్తే మన దేశంతోపాటు ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలు బాగానే అభివృద్ధి అవుతాయని ప్రచారాలమీద ప్రచారాలు చేసిన పవన్ కల్యాణ్... ఆ పార్టలకు వ్యతిరేకంగా వెనుదిరుగుతున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇటువంటి సందేహాలే వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తన పార్టీని జనాల్లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే వీరిద్దరికి వ్యతిరేకంగా అడుగులు వేయక తప్పదు. అలాకాకుండా ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారాలు చేసుకుంటూపోతే.. అతని చేతిలో మిగిలేది చివరికి ఒక్క ‘‘మైక్’’ మాత్రమే! అయితే ఆ పార్టీలతో దూరం పెంచుకోవడం అంత తేలికమైన విషయం కాదు!

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాడని అందరూ భావించిన తరుణంలో... ‘‘తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ’’ కుండబద్ధలు కొట్టేశారు. అందుకు ఒక రీజన్ కూడా వుంది. అప్పట్లో పవన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ లేరు. ఒకవేళ పోటీ చేయడానికి సిద్ధమని అభ్యర్థులు ముందుకు వచ్చినా... పవన్ కల్యాణ్ తన సిద్ధాంతాల ప్రకారం ముందుగా వారి గురించి సమాచారం సేకరించడానికి సమయం లభించేది. పవన్ నియమాల ప్రకారం.. ప్రజల సంక్షేమం కోసం అభ్యర్థులు కావాలి కానీ.. పదవిని కోరి పార్టీలో వచ్చేవారు నాకు అవసరం లేదంటూ ఆయన అప్పుడే తెగేసి చెప్పారు. దాంతో ఆయన తన పార్టీని ఎన్నికల బరిలోకి దించకుండా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసి... తన పార్టీ పేరును నాలుగువైపులా వ్యాపించుకునేలా చేసుకున్నారు.

ఇక ఎన్నికల అనంతరం పవన్ తన పార్టీ మీద దృష్టి సారించి అభ్యర్థుల జాబితాను బయటపెడతానుకుంటే అలా జరగలేదు. ఆయన కొన్నాళ్లపాటు రాజకీయమౌనాన్ని పాటించి.. సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే పవన్ ఇలా మౌనం వహించుకుంటూపోతే తన పార్టీకి గుర్తింపు రాదని భావించిన నేపథ్యంలో.. వెంటనే ఆయన తన పార్టీని నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ కు సమాచారాన్ని అందించారు. అందులోభాగంగానే ఈనెల 23లోపు జనసేన పార్టీపై అభ్యంతరాలు ఎవరికైనా వుంటే దరఖాస్తు చేయొచ్చంటూ ఈసీ ప్రకటన కూడా జారీ చేసేసింది. అంటే.. ఈనెల 23వ తేదీ తర్వాత పవన్ జనసేన పార్టీ కూడా గుర్తింపు పొందినట్టేనన్నమాట! ఇక్కడే ఇప్పుడు పవన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. పవన్ తన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అంతకంటే ముందుగా బీజేపీ, టీడీపీలతో సంబంధాలను పూర్తిగా తెగించుకోవాల్సి వుంటుంది. కానీ ఇలా చేస్తే మాత్రం పవన్ మొదట్లోనే మోసం వస్తుంది.

ఒకవేళ ఇలా కాకుండా అధికార పార్టీలకు మద్దతుగా ప్రచారాలు చేసుకుంటూ.. తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి పథకాలు రచించినా అందులో కూడా ఏ ఫలితం దక్కదు. ఎందుకంటే.. అధికార పార్టీలకు ప్రచారాలు చేసుకుంటూపోతే.. జనాలు ఈయన పార్టీ మీద అంత ఆసక్తి కలగదు. రానురాను పవన్ ఇమేజ్ కూడా రాజకీయరంగంలో దెబ్బతినే అవకాశం వుంది. పైగా ఈ రెండు పార్టీలు అధికారంలో వుండటం వల్ల.. వాటికి వ్యతిరేకంగా పవన్ ప్రశ్నలు లేవనెత్తినా... ఆ రెండు పార్టీలు కుమ్మక్కై పవన్ కి సవాల్ విసురుతాయి. ఆ సందర్భంలో పవన్ ఒక్కడే ఆ రెండు పార్టీలను ఢీకొట్టడం అసాధ్యం! మరి ఏ విధంగా పవన్ తన పార్టీని బలోపేతం చేసుకుంటాడు..? ఏ విధంగా తన పార్టీ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసుకుంటాడు..? ఏ విధంగా ఈ రెండు పార్టీలకు ధీటుగా ప్రశ్నలు లేవనెత్తుతాడు..? వీటన్నింటికీ సమాధానాలు కేవలం పవన్ దగ్గరే వున్నాయి. ఆయన తీసుకోబోయే తదుపరి నిర్ణయం మీద ఇప్పుడు ఈ సస్పెన్స్ దాగి వుంది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందున్న సవాల్ ను అధిగమించాలంటే దానికి ఒక్కటే మార్గం! అదెలా అంటే.. పవన్ తన జనసేన పార్టీ ఎజెండాను సొంతంగా రూపొందించుకుని.. దాని ప్రకారం ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి. అధికార పార్టీలతో సఖ్యతగా వుంటూనే ప్రజలకు న్యాయపరమైన నిర్ణయాల పట్ల అడుగులు వేయాల్సి వుంటుంది. ప్రజలకు ఎటువంటి పథకాలు కావాలి..? వారికి ఎటువంటి రాజకీయం కావాలి..? ఎటువంటి నాయకుడు కావాలి..? వారి మనోభావాలు ఏంటి..? అన్న విషయాలను స్వయంగా ప్రజల మధ్యకే వెళ్లి తెలుసుకోవాల్సి వుంటుంది. నేనున్నానంటూ వారికి అభయమిచ్చి ముందుండి నడిపించే నాయకుడిలా పవన్ నిర్ణయాలు తీసుకుంటే.. జనసేన పార్టీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయం! మరి పవన్ కల్యాణ్ మెదడులో ఎటువంటి ఆలోచనలు మెదులుతున్నాయో ఎవరు అర్థం చేసుకోగలరు..? ఆయన తన పార్టీ బలోపేతం కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles