Do not run for funds advises venkaiah naidu

do not run for funds advises venkaiah naidu, two days ap mlas awareness workshop, union minister venkaiah naidu chief guest mla workshop

Do not run for funds advises Venkaiah Naidu in the awareness workshop conducted for AP MLAs

పంచటం మొదలుపెడితే మిగిలేది పంచే

Posted: 07/19/2014 12:52 PM IST
Do not run for funds advises venkaiah naidu

అన్నీ ఉచితమన అనటం సముచితం కాదన్నారు రెండురోజుల ఎమ్మెల్యేల శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.  రాజకీయ పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉచిత హామీలతో ప్రజలను చెడగొడుతున్నారని ఆయన అన్నారు.  డబ్బు లేకుండా ఏ అభివృద్ధీ చెయ్యటం వీలుకాదని, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా తగు ప్రాధాన్యతనివ్వాలని కూడా ఆయన అన్నారు.  

చేసుకుంటూ పోతే ప్రజలు అన్నీ ఆశిస్తారని చెప్తూ, ఇంటిముందున్న చెత్తా చెదారాన్ని కూడా ఎమ్మెల్యేనో లేక మున్సిపల్ ఛైర్మనో తీసి వెయ్యలాని ఎదురు చూస్తారని అన్నారు.  దృష్టాంతరంగా, వెంకయ్య నాయుడు తన తండ్రిగారి హయాంలో వానాకాలంలో గ్రామాల్లో చెరువులు, కాల్వలను రైతులే బాగు చేసుకునేవారని, వాళ్ళు ఇప్పుడా పని తలపెట్టటమే లేదని అన్నారు.  

దానితో పాటే, రాష్ట్ర స్థాయిలో రావలసిన ఆదాయాలను రాబట్టుకోకుండా ఎంతసేపు నిధుల కోసం పై వాళ్ళ దగ్గరికి పోవటం కూడా సరికాదని కూడా వెంకయ్యనాయుడు అన్నారు.  రాష్ట్రాలు తమకు రావలసిన ఆదాయ వనరులను పెంచుకోవాలి కానీ నిదులకోసం పరుగులు తీయకూడదని అన్నారు.  

ఈ చివరి మాటతో ఆంధ్రప్రదేశ్ కి వస్తాయని ఆశిస్తున్న నిధుల విషయంలో కాగితాల మీద కనిపించేవి ప్రత్యక్ష రూపం ఎప్పడు దాలుస్తుందా అని కాస్త అనుమానమే కలుగుతోంది. విభజన వలన ఆదాయ వనరులు బాగా తగ్గిపోయిన ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని కాక నిధుల కోసం మరెక్కడికి పోతుంది.  పైగా విభజన వలన తరిగిపోయిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.  అంటే కేంద్ర ప్రభుత్వం తనదగ్గరున్న నిధులను పంచుతూ పోతే అక్కడ చివరకు ఏమీ మిగలదని చెప్పటమా అని కూడా అనుకోవలసివస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles