Telangana government indirectly threatens tv9 ravi prakash

tv9 ceo ravi prakash latest news, case on tv9 ravi prakash, tv9 ravi prakash in high court, tv9 ceo ravi prakash seeks anti petition bail, tv9 ravi prakash high court, tv9 ravi prakash applies for bail, tv9 ravi prakash applies for interim bail, tv9 ravi prakash, tv9 ceo ravi prakash, bullet news, telangana, high court, telangana cm kcr, తెలంగాణ శాసనసభ్యులు, telangana mlas, ముందస్తు బెయిల్, టీవీ-9 సీఈవో, రవిప్రకాశ్, anti petition bail telangana ministers filed case on tv9 ceo ravi prakash, tv9 ravi prakash apologise to telangana ministers

telangana government indirectly threatens tv9 ravi prakash, tv9 ceo ravi prakash has applied for interim bail at the high court of hyderabad, tv9 ravi prakash applies for bail

టీవీ9 రవిప్రకాశ్ భయపడుతున్నాడా? పగతో!

Posted: 07/17/2014 01:42 PM IST
Telangana government indirectly threatens tv9 ravi prakash

టీవీ9 మీడియా ప్రజల మద్యకు రాకతో అనేక మంది అవినీతి పరులు, రాజకీయ నాయకుల గుండెళ్లో రైలు పరిగెత్తాయి. నిజాయితీగా గుండె దైర్యంతో.. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు విడమరిచి చెప్పిన టీవీ9 సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక సమయంలో టీవీ9 న్యూస్ పై ఆధారపడిన రోజులు ఉన్నాయి. కానీ కాలంతో పాటు.. అనేక మీడయా సంస్థలు, కొత్తగా న్యూస్ పేపర్ సంస్థలు ముళ్లు లేని గులాబీల పుట్టుకొచ్చాయి.

అప్పటి వరకు మీడియా రంగంలో రారాజుగా వెలిగిన టీవీ9కు కొంచెం దెబ్బ తగిలింది. అయినా టీవి9 అభిమానుల సంఖ్య మాత్రం పెరిగిపోయింది. వ్యాపారపరంగా కొంచెం వెనబడినా, తన నిజాయితీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కానీ టీవీ9 ఏరోజు మీడియా స్వేచ్ఛను భంగం కలిగించలేదు. మారుతున్న కాలంతో పాటు, పెరిగిన మీడియాతో పోటీ పడి ముందుకు పోవటానికి.. కొత్త కొత్త ప్రయోగాలు చేసి న్యూస్ ను అందించటంలో ఎక్కడో చిన్న లోపం జరిగి, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల గురించి కొంచెం తప్పుగా, కొంచెం వ్యంగ్యంగా, కొంచెం అతిగా, బుల్లెట్ న్యూస్ ను టీవీ9 ప్రయోగించింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర పెద్దలు.. టీవీ9పై తీవ్రస్థాయిలో మండిపడటంతో.. వెంటనే టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ జరిగిన తప్పు తెలుసుకుని మీడియా సంస్థ తరుపున క్షమాణాలు కోరటం జరిగింది. అప్పటి వరకు టీవీ9కు తెలుగు ప్రజలు అందరు అభిమానులే. కానీ ఈ విషయం జరిగిన తరువాత..తెలంగాణ లో కొంత మంది టీవీ9కు శత్రువులుగా మారిపోయి, తెలంగాణలో టీవీ9 కార్యక్రమాలను పూర్తిగా బంద్ చేయటం జరిగింది. ఈ కుట్ర వెనుక ఏ రాజకీయ నాయకుడి హస్తం ఉందో తెలియదు గానీ .. టీవీ9ను నమ్ముకొని బతుకుతున్న ఉద్యోగుల జీవితాలు మాత్రం కొత్త రాష్ట్రంలో.. చీకటి మయం అయ్యాయి.

అప్పటి వరకు సూర్యుడిలా వెలిగిన టీవీ9 ఒక్కసారిగా సూర్యగ్రహం పట్టింది. దీంతో సూర్యగ్రహన్ని విడుపించుకోవటానికి టీవీ9 రవిప్రకాశ్ ఎన్నో ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ సూర్యగ్రహం మాత్రం విడవలేదు. దీంతో చివరకు హైకోర్టు మెట్లు ఎక్కటం జరిగింది. దీనికి కారణం టీవీ9 రవిప్రకాశ్ పై పోలీసు కేసు పెట్టారు. టీవీ9 రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే పగ చల్లారుతుందా? రవిప్రకాశ్ జైలుకు వెళ్లితే.. వచ్చే లాభం ఏంటి? ఆయన జైలుకు వెళ్లటం వల్ల ఎవరు ఆనందంగా ఉంటారు? ఉగ్రవాదులను సైతం క్షమాపణలు చెబితే.. వదిలిపెడుతున్న మన సంస్కృతి ?

అలాంటిది రవిప్రకాశ్ ఏం తప్పు చేశాడని ఆయన కు శిక్ష వేయలని రేపు కోర్టు అడిగితే ఏం సమాధానం చెబుతారు? మీడియా కు కొన్ని స్వచ్చ హక్కులు ఉంటాయి.వాటిని ఉల్లంఘించినప్పుడు., జరిగిన తప్పుకు యాజమాన్యం క్షమాపణలు చెప్పటం సహజంగా జరుగుతుంది.? అంతే ఏదో కక్ష కట్టుకొని , పగ పెంచుకొని పబ్లిక్ మీడియాను చీకటి గదిలో బంధించటం ఎంతవరకు న్యాయం అని . మీడియా అభిమానులు అడుగుతున్నారు. ‘‘ గన్ ఉంది కదా అని .. గిర గిర తిప్పితే.. చివరకు మనకే బుల్లేట్ దిగుతుంది’. నేను తప్పు చేసాను మోర్రో .. క్షమించండని.. అడిగినా పట్టించుకోకుండా..కేసులు పెట్టి కోర్టుకు లాగితే ఫలితం ఏమిటి? ‘‘చేసేవాడికి ఆనందంగా ఉంటుంది కానీ .. చూసేవారికే.. చాలా నీచంగా ఉంటుంది’’. కేంద్రప్రభుత్వంలో లేఖ రాసిన ఫలితం రాకపోవటంతో టీవీ9 రవిప్రకాశ్ లో కొత్త భయం మొదలైంది. దీంతో ఆయన హైకోర్టు మెట్లు ఎక్కటం జరిగింది.

నిన్నటి వరకు టీవీ9 న్యూస్ చూసిన లాయర్లు రవిప్రకాశ్ కేసును వాదించటానికి ముందుకు రాలేదంటే... పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ఇట్టే తెలుస్తుందని మీడియా అభిమానులు అంటున్నారు. ‘‘పకృతిలో పెరిగిన మానవమొక్కలం.. అవసరమైతే.. పదిమంది జీవితాల్లో వెలుగు నింపుదాం’’అంతేగానీ పది మంది కలిసి.. ఒక్కడిపై పగ పెంచుకోవటం తెలుగు జాతికి మంచిది కాదు. ‘‘తమ్ముడు తప్పు చేస్తే.. జైలుకు పంపిస్తామా? అన్న ఆపదాలో ఉంటే ఆదుకోలేమా? ’’. సాటి వారికి సాయం చేయని చేతులు... సమాజంలో ఉన్నా లేనట్టే లెక్క అని మీడియా మిత్రులు అంటున్నారు.

రవిప్రకాశ్ పై పగ ఎలా ఉందంటే.. ‘‘ పెళ్లి ముందు బావ.. పెళ్లైన తరువాత గీవ’’ అన్నట్లు ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. అయితే ఈ రకమైన పరిస్థితి మీడియాకు, సమాజానికి మంచిది కాదు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ సమస్యను తగు రీతిలో పరిష్కరిస్తే మంచిది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles