Balakrishna future plans to develop ananthapur

Balakrishna future plans to develop Ananthapur, MLA Balakrishna promises development in Ananthapur, Balayya to establish Cancer hospital in Hindupuram

Balakrishna future plans to develop Ananthapur

బాలయ్య చూపించిన వర్ణ చిత్రం

Posted: 06/29/2014 06:12 PM IST
Balakrishna future plans to develop ananthapur

హిందుపురం ఎమ్మెల్య్ నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా వాసులకు భవిష్యత్తులోని అనంతపురం చిత్రాన్ని చూపించారు.  

అందులో, హిందూపురంలో ఏర్పాటైన ఐటి హబ్ ఉంది.  అదే ప్లాన్ లో భాగంగా కర్నాటక నుండి హిందూపురం వరకు ఐటి కారిడార్ డెవలప్ అయ్యుంది.  ఇంకా ఐఐటి వచ్చింది, సెంట్రల్ యూనివర్శిటీ కూడా స్థాపించబడివుంది.  తనచేతిలోనే ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా హిందూపురంలో కనిపిస్తోంది.  

బాలకృష్ణ మాటలు, అందులో ఉన్న నిజాయితీ, తన నియోజకవర్గంలో ఏదో చెయ్యాలన్న ఉత్సాహం చూస్తుంటే అనంతపురం జిల్లాకి మంచి రోజులు రానున్నాయని అర్థమవుతోంది.  

మిగిలినవన్నీ, ఎంత సిఎమ్ తన బావే అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి!  కానీ క్యాన్సర్ హాస్పిటల్ మాత్రం తానుగా చెయ్యదగ్గదే కాబట్టి బాలకృష్ణ తన మాట నిలబెట్టుకుని త్వరలోనే ఆ పనికి శ్రీకారం చుడతారని ఆయన మాటలను విన్నవాళ్ళంతా ఆశగా చూడసాగారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles