Gali janardan reddy meets chandrababu

Gali Janardan Reddy meets Chandrababu, Jagan complains Gali truck with Babu, Gali Janardan Reddy illegal mining case

Gali Janardan Reddy meets Chandrababu

శాసనసభలో గాలి జనార్దన రెడ్డి ప్రస్తావన

Posted: 06/24/2014 06:35 PM IST
Gali janardan reddy meets chandrababu

గాలి జనార్దనరెడ్డి ప్రస్తావన ఈరోజు శాసనసభలో వచ్చింది. అది కూడా విచిత్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ నోటివెంట.

గాలి జనార్దనరెడ్డితో వైయస్ ఆర్ కుటుంబానికి సంబంధముందన్న విషయాన్ని గాలిని సిబిఐ అరెస్ట్ చేసిన సందర్భంలో జగన్ వ్యతిరేకించారు. గాలి జనార్దన రెడ్డిని జగన్ కి మిత్రుడిగా మాట్లాడిన పాత్రికేయుడి మీద ఆయన అప్పుడు విరుచుకుపడ్డారు.

గాలి జనార్దన రెడ్డి మీద అక్రమ మైనింగ్ చేసిన అభియోగాలు మోపిన తెలుగు దేశం పార్టీ మీద జగన్ ఈ రోజు నిండు శాసనసభలో అభియోగాలు మోపారు. చంద్రబాబు నాయుడు గాలి జనార్దన రెడ్డిని సింగపూర్ లో కలిసారని, వారిద్దరి మధ్య తెదేపా ఛీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మధ్యవర్తిత్వం చేసారని అన్నారు.

వైయస్ ఆర్ హయాంలో గాలి జనార్దన రెడ్డికి అక్రమంగా మైనింగ్ చేసే వెసులుబాటు కలిగించిన ఆరోపణమీద ఐఏఎస్ అధికారిణి జైలుకి కూడా వెళ్లారు. అయితే, భాజపా నాయకులు ఆయనకు మద్దతునివ్వకపోవటంతో గాలి చంద్రబాబుని సింగపూర్ లో కలిసారని జగన్ అన్నారు. అదే విషయాన్ని తిప్పి చంద్రబాబు మీద ప్రయోగించటం మీద పలువురు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. కానీ ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవటం ఇంకా ఆశ్చర్యం.

వాళ్ళిద్దరూ అక్కడ ఒకే సమయంలో ఉన్నట్లు దాఖలాగా పాస్ పోర్ట్ లు, విమానంలో ప్రయాణం చేసిన టికెట్లు, వీసాలు ధృవీకరిస్తాయని కూడా జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాల్వ శ్రీనివాసులు నవ్వుతూనే, తానెప్పుడూ సింగపూర్ పోలేదని సమాధానమిచ్చారు. చంద్రబాబు తో గాలి జనార్దన రెడ్డి భేటీ మీద తెదేపా నాయకులు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles