Kejriwal follows gandhi way in court in libel case

kejriwal follows Gandhi way in court in libel case, AAP Kejriwal jailed in defamation case, Kejriwal refuses to pay for bail prefers jail, Kejriwal to challenge court order

kejriwal follows Gandhi way in court in libel case

కేజ్రీవాల్ గాంధీ మార్గం!

Posted: 05/22/2014 02:59 PM IST
Kejriwal follows gandhi way in court in libel case

మహాత్మా గాంధీ చరిత్రను తిరగేస్తే, బ్రిటిష్ ప్రభుత్వంలోని కోర్టులో జడ్జ్ ఆదేశించినట్లుగా శాంతి భద్రతల దృష్ట్యా నగరాన్ని వదిలిపెట్టటానికి నిరాకరించి, మరి జైలుకి వెళ్తారా అంటే మీ ఇష్టం అని చెప్పి, పోనీ బెయిల్ కోసం వందరూపాయలు కట్టినట్లయితే వదిలిపెడతానని చెప్తే కట్టనని చెప్పి, చివరకు చేసేదేమీ లేక కోర్టు నుంచి వదిలిపెట్టిన ఘట్టం గుర్తుకి రావటానికి కారణం బుధవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయం.  

నితిన్ గడ్కరీ మీద నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గడ్కరీ వేసిన పరువు నష్టం దావాలో కోర్టు విచారణను ఎదుర్కుంటున్న అరవింద్ కేజ్రీవాల్ తను చేసింది తప్పని ఒప్పుకోలేదు, బెయిల్ కోసం పదివేల రూపాయలు కట్టమంటే కట్టటానికి నిరాకరించారు.  ఫలితంగా కోర్టు ఆదేశానుసారం ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని, తిహార్ జైల్ కి పంపించారు.  

ఢిల్లీ గద్దె మీద కూర్చుని పరిపాలించవలసిన కేజ్రీవాల్ ఢిల్లీ సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు.  అయితే కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తానని కూడా అంటున్నారాయన.  

ఇలాంటి సంఘటనే కేజ్రీవాల్ గతంలో ఆయన్ని అనుసరించేవాళ్ళు ఎక్కువగా ఉన్న సందర్భంలో వేరుగా ఉండేది కాని, ప్రజాతీర్పులో ఓడిపోయిన ఆయనకు ప్రస్తుతం కష్టం అనుభవించటానికే తప్ప ఆయన నిర్ణయం మరెందుకూ పనికి రాదు.  

కానీ ఈ హైడ్రామా ఆడకపోతే కేజ్రీవాల్ పూర్తిగా మరుగునపడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.  ఆయన మద్దతుదారులు కూడా ఎవరి గూటికి వారు పోయే ప్రమాదం ఉంది.  ఏ విషయంలోనైనా నిదానంగా ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకుని కాస్త అణిగివుండి అదను చూసి చర్య తీసుకోవటమనేది ఆమ్ ఆద్మీ పార్టీలో లేనేలేదు.  అనుకున్న వెంటనే చేసెయ్యాలి, ప్రతి విషయంలోనూ ప్రతివారితోనూ తగవులు పడాలి.  ఇవే మొదటి నుంచీ ఆ పార్టీ అవలంబిస్తున్న విధానం.  ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఆవేశంతోనే ఆవిర్భవించిన పార్టీ ఆఆపా.  ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ కి రోడ్డు మీదకు రావటం, ఆవేశంతో ఎలుగెత్తి పోరాడటం తప్ప రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి మరో మార్గం కనపడటంలేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles