Manmohan singh laughing internally

Manmohan Singh laughing internally, BJP clean sweep, Congress party lost in elections 2014, Manmohan enjoys mother son plight, Manmohan relieved from Sonia and Rahul

Manmohan Singh laughing internally

లోలోపలే నవ్వుకుంటున్న మన్మోహన్?

Posted: 05/17/2014 03:57 PM IST
Manmohan singh laughing internally

ప్సంజయ్ బారు తన పుస్తకంలో రాసిన విషయాలు నిజమైనట్లయితే, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిపోయినా మన్మోహన్ సింగ్ లోలోపల నవ్వుకుంటూ ఉండాలి!

కాంగ్రెస్ పార్టీ పడిపోవటంతో ఆయన స్థానంలో ఆ పార్టీలోంచి మరొకరు వచ్చే అవకాశం లేకపోవటం ఒకటైతే, తల్లీ కొడుకులు ఆయనతో ఆడుకోవటం, ఆయనను అవమానించి, ఆయనకు మనస్తాపం కలిగించే పనులు చేస్తూ ఆయన ఆఫీసుని కూడా వాళ్ళే నడపటం ఇలాంటి వాటి వలన ఇప్పుడు వాళ్ళే దిక్కు మొక్కు లేకుండా పోయారనే ఆనందం మన్మోహన్ సింగ్ కి కలుగుతోందని ప్రధానమంత్రి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మన్మోహన్ సింగ్ మీద రాసిన పుస్తకంలోని అంశాల మీద ఆధారపడి కొందరు విశ్లేషకులు అంటున్నారు.

పార్టీకి విశ్వాసపాత్రుడిగా పనిచెయ్యటం వేరు కానీ మరీ ఆటబొమ్మలా చేసి ఆడించే నాయకుల శృంఖాలాలనుండి బయటకు రావటానికే నిర్ణయించుకున్న మన్మోహన్ సింగ్ కి తనని ఆడించినవాళ్ళు పొందుతున్న మనోవేదన ఆయనకు కొంత ఉపశమనం కలుగజేస్తుందేమో అంటున్నారు వాళ్ళంతా.

మంచిపనైంది మంచిపనైందని మన్మోహన్ సింగ్ లోపలి అంతరాత్మ గంతులు వేస్తోందని చెప్పుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles