Ec serves notice on rahul gandhi

EC serves notice on Rahul Gandhi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

EC serves notice on Rahul Gandhi

రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు ఈసి నోటీసు!

Posted: 05/10/2014 10:22 AM IST
Ec serves notice on rahul gandhi

భాజపా అధికారంలోకి వస్తే 22000 మంది చనిపోతారంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే 1 న హిమాచల్ ప్రదేశ్ లోని సోలాన్ లో చేసిన అనుచితి వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ కి సంబంధిత సిడిలు, పేపర్ క్లిప్పింగ్స్ లతో భాజపా ఫిర్యాదు చెయ్యగా, ప్రాధమికంగా అది కోడ్ ఉల్లంఘనే అవుతుందని, దానిమీద వివరణనివ్వమని ఈసి రాహల్ గాంధీకి నోటీసు పంపించింది.  

రాహుల్ గాంధీకి షో కాజ్ నోటీస్ పంపిన ఈసి దానికి వివరణ మే 12 ఉదయం వరకు రానట్లయితే మరోసారి నోటీసు ఇవ్వకుండా ఉచిత రీతి చర్యలకు ఉపక్రమిస్తామని కూడా నోటీసులో ఈసి తెలియజేసారు.  

సమాజంలో పరస్పర విభేదాలు కలిగించే విధంగా ఎన్నికల ప్రచారాలలో ప్రసంగాలు చెయ్యగూడదని ఆధారాలు లేని ఆరోపణలు ఇతర పార్టీల మీద చెయ్యగూడదని ఉన్న నియమాలను ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీకి నోటీసిచ్చిన ఈసి రాహుల్ గాంధీది కచ్చితంగా ఉల్లంఘనేనని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles