Sabbam hari not invizag race support to nda shock to ys jagan

sabbam hari not in vizag race, Sabbam Hari Vizag Lok Sabha Race, shock to ys jagan, Jai Samikyandhra Party leader Sabbam Hari, Jai Samikyandhra Party, election 2014, ys vijayamma lok sabha race in vizag, sabbam hari, support of NDA, Sabbam Hari In Visakhapatnam.

sabbam hari not in vizag race support to nda shock to ys jagan, Sabbam Hari Quits From Vizag Lok Sabha Race

జెండా పీకిన సబ్బం హరి-కుప్పకూలిన జగన్?

Posted: 05/06/2014 04:34 PM IST
Sabbam hari not invizag race support to nda shock to ys jagan

సబ్బం హరి గురించి తెలియని రాజకీయ నాయకులు లేరు. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు కోవర్టుగా పని ఘనత సబ్బం హరికే దక్కింది, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. జగన్ కు , ఆయన పార్టీకి మద్దుతు ఇచ్చిన ఏకైక నేత సబ్బం హరే. అయితే రాష్ట్ర విభజన సమయంలో.. జై సమైక్యాంద్ర ఎజెండాను నెత్తిన పెట్టుకొని ఇప్పటివరకు తిరిగిన వ్యక్తి సబ్బం హరి.

సుప్రీం కోర్టు .. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వేసిన ఫిటిషన్ పరిశీలించి .. సమైక్యవాదుల ఆశలపై నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. దీంతో జై సమైక్యాంద్ర పార్టీలోని నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు గురించి మిట్ నైట్ ఆలోచించి, తెల్లవారిన వెంటనే సబ్బం .. జై సమైక్యాంద్ర జెండాను పీకిపారేసి, మీడియా ముందుకు వెళ్లి నేను ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నాను అని చెప్పటంతో వైఎస్ జగన్ కుప్పకూలినట్లు సమాచారం. 

జగన్ కు సబ్బం హరి మద్య ఉన్న సన్నిహిత సంబంధం చాలా ద్రుడమైనదని అందరికి తెలుసు. కాకపోతే.. కొద్ది రోజులు ఈ ఇద్దరి మద్య మాటలు లేవని రాజకీయ నేతలు అనుకుంటున్నారు. కానీ చీకట్లో రాజకీయలు చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సబ్బం కూడా విశాఖ బరినుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుప్రీం కోర్టుతీర్పుతో సమైక్యం ఇక కుదరదని విభజన జరిగిపోయిందని తేలిపోయిందని ఇక సీమాంధ్రకు మంచి నాయకత్వం కావాలని ఆయన కోరారు.

అంతేకాదు ఇక ఫైనల్ గా సబ్బం ఎన్డీయేకు మద్దతుగా లోక్‌ సభ బరి నుంచి వైదొలగినట్లు ప్రకటించారు. ఇదే వ్యవహారంపై అనుచరులతో చర్చించి మీడియా ఎదురుగా అధికారికంగా ప్రకటించారు. కాగా బిజేపీ-టిడిపి పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి అప్పగించింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర బిజేపీ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు రంగంలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఇక వైకాపా నుండి జగన్ తల్లి, విజయమ్మ రంగంలో ఉన్నారు.

ప్రధానంగా కూటమి-వైకాపా మధ్య పోటీఉండగా సబ్బం భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందని అనుకున్నారు. ఈ క్రమంలో వైకాపా లాభపడుతుందని.. అలాంటి ఆరాచక, దోపిడీ శక్తులు విశాఖలో ఉండకూడదనే తాను ఎన్డీయేకు మద్దతు ఇస్తూ పోటీని విరమించుకున్నట్లుగా ప్రకటించారు. ఇది విజయమ్మకు, ఆ పార్టీకి భారీ గండికొట్టే అవకాశమే ఉన్నట్లుగా తెలుస్తుంది! ఇది జగన్ మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్ అని రాజకీయ మేథావులు అంటున్నారు. సబ్బం హరి సమైక్య జెండా పీకినప్పటి నుండి.. జగన్ చాలా బాధపడుతున్నట్లు .. ఆ పార్టీ కార్యకర్తులు అంటున్నారు.

అంటే విశాఖలో..వైఎస్ విజయమ్మ విజయం పై అనుమానం కలుగుతుందని ఆ పార్టీలో సీనియర్ నాయకులు మథనపడుతున్నారు. కానీ రేపు జరిగే ఎన్నికలకు .. ఒక చీకటి రాత్రి అడ్డుగా ఉన్న విషయం తెలుసుకోవాలి. ఈ చీకటి రాత్రులే..రాజకీయా రంగులు పూర్తిగా మారిపోతాయని సీనియర్ నేతలు అంటున్నారు. తెల్లవారితో ఏం జరుగతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles