Ysrcp leaders silent on trs party high speed

ys jagan, ysrcp, ysr congress party, kcr, ys jagan, kcr party, trs party, sharmila, 2014 election, telangana election 2014, kcr comments on andhra parties, jagan ys, trs leaders comments on seemandhra people.

ysrcp leaders silent on trs party high speed

వైసీపీ మౌనవ్రతం కేసిఆర్ కు వరం?

Posted: 04/21/2014 01:15 PM IST
Ysrcp leaders silent on trs party high speed

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్,  ఆయన కుటుంబ సభ్యులు , పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల  మౌనవ్రతమే  తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు  కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వరంగా మారినట్లు తెలుస్తోంది.  జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు  రెచ్చిపోయి మాటల తుటాలు పెల్చుతున్నారు. కొంతమంది వ్యక్తిగత విషయలపై కామెంట్లు చేస్తున్నారు.  ఇక కేసిఆర్ గురించి చెపాల్సిన పనేలేదు.  అసలే  ఆయన మాటల మాంత్రికుడు.  ఎప్పుడు, ఎక్కడు, ఎలా మాటలతో యుద్దం పుట్టించాలో, రంగుతున్న మంటల్ని ఎలా ఆర్పాలో  తెలిసిన  మహా నాయకుడు కేసిఆర్. ఇక ఎన్నికల సమయంలో  కేసిఆర్ మాటల దూకుడికి హద్దే లేదని   చదువుకున్న యువకులు అంటున్నారు. 

కేసిఆర్ మాటల వరదకు.. కాంగ్రెస్, టిడిపి, బిజేపి పార్టీల నాయకులు రెచ్చిపోయి పోటీగా కౌంటర్ ఇస్తున్నారు.  కానీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్ గానీ, ఆ పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ,  ఆయన కుటుంబ సభ్యులు గానీ , ఇప్పటి వరకు  తెలంగాణలో కేసిఆర్ పై  ఒక్క కామెంట్ కూడా  చేయకపోవటం  ఆశ్చర్యంగా ఉందని    హైదరాబాద్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ప్రజలు అంటున్నారు. 

ysr congress party

ఇప్పుడు వరకు వైసీపీ పార్టీ నాయకులు  మౌనవ్రతం  చేయటంతో.. కేసిఆర్ కు పెద్ద వరంగా  మారింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు  రెచ్చిపోయి, సీమాంద్ర ప్రజలపై, ఉద్యోగులపై, విమర్శలు గుప్పిస్తున్నారు.  నగరంలో ఉంటున్న సీమాంద్ర ప్రజలు  భయపడుతున్నారు.  హైదరబాద్ నగరంలో 35 లక్షల మంది సీమాంద్ర ప్రజలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వారి ఓటు బ్యాంకు పై కేసిఆర్ అండ్ కో  ద్రుష్టి పెట్టింది. 

సీమాంధ్రుల ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. విభజన సమయంలో కిక్కురమనని కేసీఆర్, ఇప్పుడు ఓట్ల కోసం పోలవరాన్ని, ఉద్యోగుల ఆప్షన్లను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయనకు నిజంగా పోలవరం ముంపు గ్రామాలపైన, ఉద్యోగుల పైన ప్రేమ ఉంటే లోక్ సభలో బిల్లు పాసవుతున్నప్పుడు ఏం చేశారు? నిద్రపోయారా?  అని నగరంలో సెటిలైన ఉద్యోగులు అడుగుతున్నారు.

kcr election camp

అయినా...మేము సమైక్యం, సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడటంలో తమను మించిన వారు లేరని డబ్బా కొట్టుకున్న జగన్, ఆయన పార్టీ నేతలు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని నగరంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ.. మూడు పార్టీలు కేసీఆర్కు ధీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. వైసీపీ మాత్రం మౌనవ్రతం పాటిస్తోందని తెలంగాణ నివసిస్తున్న సీమాంద్ర ప్రజలు అంటున్నారు.

ఇటీవల తెలంగాణాలోని  జిల్లాల్లో షర్మిళ ప్రచారం చేసినప్పుడు తెలంగాణలోని సీమాంధ్రుల గురించి మాట్లాడకపోయినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు... కానీ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, సనత్ నగర్, ఖైరతాబాద్ ల్లో మాట్లాడినప్పుడు కూడా సెటిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేసిఆర్ మాటల గురించి మాట్లాడకపోవడం క్షమించరాని విషయమని నగరంలోని సెటిలర్స్ అంటున్నారు.  నగరంలో షర్మిళ  నిర్వహించిన సభలే ఇందుకు నిదర్శనమని  నగర ప్రజలు అంటున్నారు. 

వైసీపీ మౌనవ్రతం చూస్తుంటే ..కేసిఆర్ పార్టీతో  కలిసిపోయినట్లుగా ఉందని నగరంలోని నివసిస్తున్న రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles