Sonia gandhi s farewell speech on tv bjp says

Sonia Gandhi's farewell speech on TV BJP says, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Sonia Gandhi's farewell speech on TV BJP says

సోనియాది ఫేర్ వెల్ స్పీచ్-భాజపా

Posted: 04/15/2014 11:23 AM IST
Sonia gandhi s farewell speech on tv bjp says

సోమవారం రాత్రి టివి ఛానెల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ఫేర్ వెల్ స్పీచ్ గా అభివర్ణించింది.  కాంగ్రెస్ పార్టీ ఎలాగూ పోతోంది కాబట్టి పోతూ పోతూ సోనియా గాంధీ మాట్లాడిన మాటలుగానూ, ఓడిపోతున్నందుకు నిరాశలో పలికిన పలుకులుగాను భాజపా పేర్కొంది. 

టివి ఛానెల్స్ కి డబ్బు చెల్లించి తీసుకున్న 3 నిమిషాల ఎయిర్ టైం లో చెప్పిన సోనియా గాంధీ మాటలలో దేశంలో విద్వేషాలు రగిలించి నిరంకుశపాలనతో  భారతదేశ విలువలను నాశనం చేస్తారని, భారతీయత, హిందుస్తాన్ తత్త్వాన్ని పాడుచేస్తారని అన్నారు. 

అసలు ఆ భారతీయత అంటే ఏమిటో ఆమెను ముందు తెలుసుకోమనిండి అంటున్నారు భాజపా నాయకులు.  విపరీతంగా పెరిగిన ధరలు, ఆర్థిక నేరాలు, అవినీతి, ప్రధానమంత్రి కార్యాలయంలో గోప్యతా లోపంతో రహస్యాలు బయటకు పోవటం ఇవి భారతీయత, హిందుస్తానియత్ అనిపించుకుంటాయా అని అడిగారు భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ. 

సోనియా గాంధీ ప్రసంగంతో, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఎంతబాగా విఫలమయ్యారన్నది ద్యోతకమౌతోందని అరుణ్ జైట్లీ తన బ్లాగ్ లో రాసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles