High court asks ec for aap registration details

High Court asks EC for AAP registration details, Aam Admi Party, Delhi High Court, Arvind Kejriwal, Delhi Assembly, Loksabha polls 2014

High Court asks EC to provide AAP registration details

ఆమ్ ఆద్మీ పార్టీ నమోదు వివరాలు కోరిన హైకోర్టు

Posted: 03/22/2014 09:43 AM IST
High court asks ec for aap registration details

అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చెయ్యాలని ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దృష్ట్యా హైకోర్టు ఎన్నికల కమిషన్ ని ఆ పార్టీ నమోదు చేసిన వివరాలను కోర్టుకి సమర్పించమని కోరింది.

ఆమ్ ఆద్మీ పార్టీ లెటర్ హెడ్స్ మీద మరితర చోట్లా అశోక్ చక్రాన్ని ఉపయోగించటాన్ని పిటిషనర్ తప్పు పట్టారు.  అశోక్ చక్రం జాతీయ చిహ్నమని, దాన్ని వ్యక్తిగత ఉపయోగార్థం తీసుకునేది కాదని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదన. 

ఏయే ఆధారాల మీద ఆఆపాను రిజిస్టర్ చేసారో తెలియజేయమంటూ ఢిల్లీ హైకోర్టు ఎన్నికల కమిషన్ ని కోరుతూ విచారణను మే 2 కి వాయిదా వేసింది. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆఆపా సంస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ కేవలం 49 దినాల అనంతరం రాజీనామా చేసి తన సీమను ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పెంచుకుని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles