Sharad pawar denies meeting modi

Sharad Pawar denies meeting Modi, National Congress Party, Narendra Modi, Sharad Pawar

Sharad Pawar denies meeting Modi, National Congress Party, Narendra Modi

ఎన్నికలు దగ్గరపడుతుంటే అనుమానాల భర్తల్లా ...

Posted: 01/31/2014 02:43 PM IST
Sharad pawar denies meeting modi

భారత రాజకీయ రంగంలో ఈ సారి ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా మారనున్నాయి.  కాంగ్రెస్ పార్టీని ఊసులో లేకుండా చేస్తానని భారతీయ జనతా పార్టీ చెప్పుకొస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఆ మధ్యకాలంలోనే నాలుగ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో తన పట్టు పోగొట్టుకోవటంతో మనుగడకోసం వ్యూహరచనలు చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ఏ నాయకుడైనా ఇతర పార్టీలతో కలుస్తున్నాడేమో అనే అనుమానాలు రావటం సహజం.  అయితే చాలా సందర్భాల్లో అదంతా ఒట్టిదే అని వార్తలలోకి ఎక్కిన నాయకులు కొట్టిపారేస్తుంటారు కూడా.  బుధవారం నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇచ్చాయి కాబట్టి ఆయనను గుజరాత్ అల్లర్లతో ఇంకా ముడిపెట్టటం సరికాదని చెప్పటంతో రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. 

నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ నరేంద్రమోదీని కలిసారనే వార్తలు గుప్పుమనటంతో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అలాంటిదేమీ లేదని అన్నారు.  ముఖ్యమంత్రుల సదస్సులో తప్ప మరెప్పుడూ మోదీని కలవలేదని, తాను వ్యక్తిగతంగా మోదీతో కలిసానని పత్రికలలో వస్తున్న వార్తలు సత్యదూరమని ఆయన తెలియజేసారు.

ఇలాంటి శంకలు, శీల పరీక్షలు ఇంకా చాలా చూస్తాం మే నెల వరకు వచ్చే అవకాశమున్న 2014 ఎన్నికల లోపులో. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles