Tdp mla motkupalli narasimhulu join to cong

motkupalli narasimhulu, rajya sabha, congress, jana reddy, TDP, Motkupalli Narasimhulu, telugu desam party, rajya sabha elections,

TDP MLA Motkupalli Narasimhulu join to congress. political circles is that Congress High Command has also given Motkupalli entry, the green signal.

మోత్కుపల్లి టీడీపీని వీడుతున్నాడు ?

Posted: 01/28/2014 04:08 PM IST
Tdp mla motkupalli narasimhulu join to cong

గత రెండు మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పై నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కారారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుండి రాజ్యసభ సీటు ఇస్తానని ఆశపెట్టి, ఇప్పుడు మొండిచేయి చూపిన బాబు పై కోపంతో ఆ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు నల్గొండ జిల్లా నేతలతో మంతనాలు కూడా జరుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాబుగారు మోత్కుపల్లిని బుజ్జగించడానికి టీడీపీలోని సీనియర్ లీడర్లను ఎర్రబెల్లి, ఎల్. రమణ, విజయరమణారావు, ఊకే అబ్బయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు పంపాడు. పరిస్థితిని అర్థం చేసుకోవాలనీ, పార్టీలో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామనీ చంద్రబాబు హామీ ఇస్తారని ఆ బ్రుందం చెబితే... వారితో తెలుగు దేశంలో ఉండే కంటే కట్టెలు కొట్టుకొని బతకడం మేలని వారితో ఉన్నట్లు సమాచారం. వారు ఎంత చెప్పినా వినకుండా మోత్కుపల్లి పార్టీని వీడే విషయమై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నల్లొండ జిల్లాలో కాస్తంత పేరున్న లీడర్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మోత్కుపల్లి పై కన్నేసి ఆ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జానారెడ్డితో కాంగ్రెస్ మధ్యవర్తిత్వ్తం చేయిస్తుందని, ఇదే అవకాశంగా భావించి కాంగ్రెస్ హై కమాండ్ కూడా మోత్కుపల్లి ఎంట్రీకి ఓకె చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా దళితుడైన మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానిస్తే ఆ ఓట్లు కూడా రాబట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో జానా రెడ్డి కూడా మద్యవర్తిత్వం వహిస్తున్నాడని అంటున్నారు. రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడంకన్నా,

తనను పార్టీలో చిన్న చూపు చూడటం, తన పట్ల నిర్లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించడమే తనకు తీవ్ర మనస్తాపం కల్గించిందని మోత్కుపల్లి సన్నిహితుల వద్ద వాపోతున్నారట కూడ. మరి రాజకీయ వర్గాల్లో వస్తున్న ప్రకారం మోత్కుపల్లి ‘సైకిల్ సీటు దిగి.... కాంగ్రెస్ చేయందుకుంటాడో లేదో చూడాలి ’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles