Tdp leaders fears threat

TDP leaders fears threat, tdp party, telugudesam, rayala telangana, congress party, ap bifurcation, chandra babu naidu,

TDP leaders fears threat.

తెల్లవారితే.. భయపడుతున్న తమ్ముళ్లు?

Posted: 12/02/2013 01:51 PM IST
Tdp leaders fears threat

తెల్లవారితే  తెలుగు దేశం పార్టీ  తమ్ముళ్లు భయపడి పోతున్నారు. నిన్నటి వరకు మీడియా  ముందు  రాజకీయ ప్రకటనలు చేసి,  రాజకీయంలో ప్రకంపనలు రేపిన  రెబల్ తెలుగు తమ్ముళ్లు  మీడియా ను చూస్తే వణికి పోతున్నారు. కాదు.. కాదు.. ముఖం చాటేస్తున్నారు.  మీడియా కు దూరం దూరంగా ఉంటున్నారు. అసలు వీరు ఇలా ఉండటానికి కారణం  కాంగ్రెస్ పార్టీయే అని అంటున్నారు.  నిన్నటి వరకు రాష్ట్ర విభజన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ  లేఖ రాయడం వలనే  రాష్ట్ర విభజన జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ  కలర్ పుల్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.   అప్పుడు టిడిపి తమ్ముళ్లు  రెండు ప్రాంతాల నాయకులుగా  విడిపోయి, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీకి మరో సమస్య వచ్చిపడింది.

కాంగ్రెస్ పార్టీ  తెరపైకి రాయల్ తెలంగాణ అంటూ కొత్త ప్రకటన మీడియాలో హల్ చల్ చేస్తుంది.  దీంతో   తెలుగు దేశం తమ్ముళ్లు  అయోమయంలో పడ్డారు.  నిన్నటి వరకు  తమ్ముళ్ల మద్య.. తెలంగాణ కావాలని  కొంతమంది,  సమైక్యంగా  ఉంచాలని మరి కొంతమంది నాయకులు   మీడియాలో రాజకీయ దుమారం రేపిన విషయం  తెలిసిందే. అయితే  రాయల తెలంగాణ పేరు వినిపించటంతో.. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు  ముఖాలు మాడిపోయాయి.  ఇప్పుడు  రాయల తెలంగాణ పేరు తెరపైకి రావడంతో.. టిడిపి  సీనియర్ నాయకుడు సోమిరెడ్డి లాంటి నాయకుల సైతం సైలెంట్ గా  ఉన్నట్లు సమాచారం. ఇటు తెలంగాణ టిడిపీ నాయకులు గానీ,  అటూ కోస్తా టిడిపి నాయకులు గానీ,  రాయలసీమ నాయకులు గానీ.. ఎదురుపడితే పలకరింపులు కరువయ్యాయట. ఒకవేళ మీడియా చొరవ తీసుకొని పలకరిస్తే..  నా చాలా అర్జెంట్ అంటూ..  బాత్ రూమ్ లోకి వెళ్లి మధన పడుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే  మీడియాతో ఏం మాట్లాడితే ఏం  ముంచుకొస్తుందో, అర్థంగాక తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు.

ఎప్పుడు ఎన్టీఆర్ భవన్ లో రాత్రి 11 అయిన తరువాత సీనియర్ నాయకులతో సందడిగా ఉండేది. కానీ రాయల తెలంగాణ పేరు  తెరపైకి వచ్చినప్పటి నుండి.. ఎన్టీఆర్ భవన్ సాయంత్రం 5 గంటలకే ఖాళీ అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు  తెల్లవారిందంటేనే.. భయంతో వణికిపోతున్నారని.. పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కొంతమంది నాయకులు అయితే.. లంచ్ సమయంలో ఎన్టీఆర్ భవనానికి  అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అంటే ఎక్కువు సమయం ఇంటిలోనే తెలుగు తమ్ముళ్లు గడుపుతున్నట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి. రాయల తెలంగాణ తో తెలుగు తమ్ముళ్లు  అయోమయంలో పడ్డారనే విషయం  అందరికి అర్థమవుతుంది. దీనిపై  చంద్రబాబు ఏం మాట్లాడతారో చూడాలని.. ఆ పార్టీ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles