Rahul leg effets on sachin out

Rahul leg effets on sachin out, Sachin Tendulkar out at 74, fans disappointed, Sachin Tendulkar out for 74 in farewell Test,Sachin Tendulkar out for 74, congress party, Rahul gandhi, bjp leaders fire on rahul, sachin last match,

Rahul leg effets on sachin out, Sachin Tendulkar out at 74, fans disappointed

రాహుల్ లెగ్ ఎపెక్ట్ - సచిన్ సెంచరీ మిస్ ?

Posted: 11/15/2013 04:39 PM IST
Rahul leg effets on sachin out

ప్రపంచం కళ్లు మొత్తం క్రికెట్ దేవుడు సచిన్ మీద ఉన్నవిషయం తెలిసిందే. సచిన్ ప్రతి కదిలికను, ఆయన అభిమానులు మనసుతో స్కెన్ చేసుకుంటున్నారు. సచిన్ మీద ఉన్న అభిమానంతో.. స్టార్లు సైతం తమ సొంత పనులు వదులుకోని.. వాంఖేడే స్టేడియంలో సందడి చేయటం జరిగింది. అయితే సచిన్ మొదటి రోజు ఆట తీరుతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. సచిన్ రెండో రోజు ఆడే ఆట పై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

 

సచిన్ చివరి సారిగా సెంచరీ చేస్తే చూడాలని ఆశతో అభిమానులు వాంఖేడే స్టేడియంలోకి అడుగు పెట్టారు. అభిమానులు ఆశల అనుగుణంగా సచిన్ రెండో రోజు ఆడే మ్యాచ్ లో అర్థసెంచరీ చేసి సరికొత్త ఆనందం నింపాడు. స్టేడియంలో అభిమానులు సందడితో సచిన్ క్రిజ్ లో ఆట నెమ్మదిగా ఆడుతూ.. సోర్కు ను సెంచరీ వైపు పరుగులు తీయిస్తున్నాడు. ఇంతలో వి.వి. విఐపి గ్యాలరీలో అలజడి, స్టేడియంలోని వారి చూపులు ఒక్కసారి అటువైపు చూశాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొడుకు, యువనేత రాహుల్ గాంధీ రావటం జరిగింది.

 

రాహుల్ గాంధీ కూడా సచిన్ అభిమానే అనే విషయం బయటపడింది. రాహుల్ గాంధీ వాంఖేడే స్టేడియంలోకి అడుగు పెట్టిన నాటి నుండి సచిన్ ఆటలో మార్పు కనిపించిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. రాహుల్ వచ్చిన పది నిమిషాల్లోనే సచిన్ అవుట్ అవ్వటం జరిగింది. సచిన్ సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో రాహల్ రాకతో స్టేడియంలో అలజడి, సచిన్ ఆట కు ఇబ్బందిగా మారినట్లు క్రికెట్ అభిమానులు అంటున్నారు. అప్పటికే సచిన్ 74 పరుగులతో ముందు సాగుతున్నారు. ఇంతలోనే సచిన్ అవుట్ అవ్వటంతో .. ఆభిమానుల్లో ఒక్కసారిగా నిరాశ నాట్యం చేసింది. అయితే అక్కడే ఉన్న రాహుల్ వెంటనే స్టేడియం నుండి వెళ్లిపోయినట్లు క్రికెట్ అభిమానులు అంటున్నారు.

 

రాహుల్ సచిన్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన విషయం పై బీజేపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఓడిపోయిందని, అది ద్రుష్టిలో పెట్టుకొని .. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి రాహుల్ గాంధీ సొంత పార్టీ నాయకులే .. ఐరన్ లెగ్ తో పోల్చి చెవులు కొరుక్కున్నా విషయం తెలిసిందే.

 

ఇప్పుడు సచిన్ సెంచరీ మిస్ అవ్వటానికి కారణం కూడా రాహుల్ గాంధీ లెగ్ మహిమే అని బీజేపి పార్టీ, సచిన్ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇలాంటి విషయాలను పక్కనపెట్టి, నిజంగా సచిన్ సెంచరీ మిస్ అవ్వటం చాలా బాధకరమైన విషయమేనని సచిన్ అభిమానులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles