AP PCC Chief RaghuVeera Reddy on Chandrababu Corruption

Congress chief ready for cbn corruption

AP PCC Chief Raghu Veera Reddy, Raghu Veera Reddy Chandrababu, Raghu Veera Reddy Corruption, Dopidi Babu, Raghuveera Reddy Charge Sheet

Raghuveera Reddy Releases Charge Sheet against AP Govt Failures.

బాబు దోపిడీ.. చర్చకు మేం రెడీ: కాంగ్రెస్

Posted: 06/16/2017 04:48 PM IST
Congress chief ready for cbn corruption

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘దోపిడి బాబు’ పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం బాబుపై విమర్శలు చేశాడు. అంతేకాదు టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ ను ఆయన విడుదల చేశారు. బాబు మూడేళ్ల పాలనలో అవినీతిమయమని, ఓ ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడటం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు. సీఎం సహా ఆ పార్టీలో ఉన్న వారందరూ ఆర్థిక నేరస్థులేనని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘దోపిడి బాబు’ పేరిట విడుదల చేసిన ఈ పుస్తకం ద్వారా ప్రజలకు అన్ని విషయాలు వివరించడానికి తాము సిద్ధమేనని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని రఘువీరా సవాల్ విసిరారు.రాష్ట్రంలో రూ.34 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను రూ.76 వేల కోట్లకు పెంచి కేబినెట్ నిర్ణయంతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ మంత్రులే భూదందాలకు పాల్పడి రోడ్లపైనే కొట్టుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు పలు కులాలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అబద్ధాల కోరు ట్యాగ్ లైన్ తగిలించుకున్నాడని, టీడీపీ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎవరిని మభ్యపెట్టేందుకని రఘువీరా ప్రశ్నించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  PCC Chief  Raghu Veera Reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more