Bjp Leader Daggubati Purandeshwari Makes Controversial Comments On YS Jagan Hunger Strike | Ys Jagan Hunger Strike

Daggubati purandeshwari comments ys jagan hunger strike in guntur district

daggubati purandeshwari news, daggubati purandeshwari videos, ys jagan hunger strike, ys jagan deeksha news, ys jagan rally, ap special status, andhra pradesh news, ap polavaram project issue

Daggubati Purandeshwari Comments YS Jagan Hunger Strike In Guntur District : Bjp Leader Daggubati Purandeshwari Makes Controversial Comments On YS Jagan Hunger Strike In Guntur District

అందుకే జగన్ దీక్ష చేస్తున్నారు : పురందేశ్వరి

Posted: 10/08/2015 03:28 PM IST
Daggubati purandeshwari comments ys jagan hunger strike in guntur district

ప్రత్యేక హోదా కోసం వైకాపాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే! ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ ఆయన చేపట్టిన ఈ దీక్షపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు తమదైన శైలిలో జగన్ దీక్షపై సెటైర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జగన్ ఈ దీక్ష చేపట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్న పురందేశ్వరి.. ఈ సందర్భంగా జగన్ దీక్షపై విమర్శలు చేశారు. పార్లమెంటరీ బిల్లులో ప్రత్యేక హోదా అనే పదం లేకపోయినప్పటికీ ఏపీని కేంద్రం తప్పుకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చిందని.. అలాంటప్పుడు ‘హోదా’ కోసం అనవసరంగా రాద్ధాంతం చేయడం ఎందుకని అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జగన్ దీక్ష చేపట్టి నానా రాద్ధాంతం సృష్టిస్తున్నారని, ఆయన దీక్ష చేయడం వల్ల ఎటువంటి లాభం లేదని ఈమె తేల్చి చెప్పేశారు.

ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. సమయానికి నివేదిక పంపించకపోవడం వల్లే నిధుల విడుదలలో ఆలస్యమైందని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more