గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి వివాదం రోజురోజుకీ అగ్గిరాజుకుంటోంది. ఓవైపు.. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, రిషితేశ్వరికి న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు.. ఇదే అదును అవకాశమని భావించిన వైకాపా పార్టీ నేతలు మూకుమ్మడిగా టీడీపీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే రోజా ఏపీ సీఎం చంద్రబాబు మీద అగ్గీమీద గుగ్గిలమయ్యారు. నిన్నటికి నిన్న రిషితేశ్వరి కేసును డబ్బులతో సెటిల్ చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆమె.. తాజాగా మరోసారి ఆయన మీద ఫైరయ్యారు.
ఇటీవల రిషితేశ్వరి కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు, 500 గజాల స్థలం కేటాయించాలని చంద్రబాబు మంత్రిమండలిలో నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై రోజా స్పందిస్తూ.. ఆడపిల్ల ఖరీదు రూ.10 లక్షలు, 500 గజాల స్థలమా? అంటూ ఆమె బాబు సర్కార్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రిషితేశ్వరి ఘనటపై నిరసన వ్యక్తం చేసిన రోజా.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబుపై మండిపడ్డారు. అధికార పార్టీ అండతోనే బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు రెచ్చిపోయారని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ ను తక్షణమే ఏ1 ముద్దాయిగా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా తాము నిరసనను విశ్రమించే ప్రసక్తే లేదని రోజా తేల్చి చెప్పారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్న రోజా.. మహిళలంటే బాబుకు ఎందుకింత వివక్ష? అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. బాబు పూర్తిగా మహిళా వ్యతిరేకిగా మారారని ఆమె అభిప్రాయం వెల్లడించారు. రిషితేశ్వరికి న్యాయం జరిగేలా త్వరగా చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more