Chandrababu Naidu Latest Proposal to Telangana Cm KCR | Telangan State | Andhra Pradesh State

Chandrababu naidu latest proposal telangana govt kcr on states issues

chandrababu naidu, cm kcr, babu new proposal, telangana problems, andhra pradesh issue, ap capital news, telangana govt, ap govt, trs ministers, tdp ministers, chandrababu controversy, kcr controversy

Chandrababu Naidu Latest Proposal Telangana Govt KCR on States Issues : Ap cm chandrababu naidu offers latest proposal to telangana govt cm kcr.

విభేదాలున్నా.. ప్రభుత్వాలుగా ముందుకెళ్దాం : బాబు పిలుపు

Posted: 05/19/2015 11:59 AM IST
Chandrababu naidu latest proposal telangana govt kcr on states issues

రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే! ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం, సంచలనాలకు తెరలేపడం వంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి.. జరుగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఈ రెండు ప్రభుత్వాల మధ్య విభేదాలు విద్యుత్ పంపిణీ, విద్యుదుత్పత్తి, నీటి వాటాలు, ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల విషయాల్లో మరింత తారాస్థాయికి చేరాయి. ఈ వ్యవహారాల్లో రెండు ప్రభుత్వాలు దుమ్మెత్తిపోసుకున్నాయే తప్ప.. పరిష్కార మార్గాలను మాత్రం అన్వేషించలేకపోయాయి.

అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ మధ్య వున్న విభేధాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పరిష్కార మార్గాలను అన్వేషిద్దాం రండి అని తెలంగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనలో వున్న సందర్భంగా ప్రకటన చేశారు. రాజకీయంగా విభేదించినా.. ప్రభుత్వాలుగా ముందుకెళదామంటూ ఆయన ప్రతిపాదన చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ.. 9,10వ షెడ్యూల్ కేటగిరీ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, ఈ సంస్థల విభజన కలిసి కూర్చుని చర్చించుకుందామని ఆయన టీఎస్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

అంతేకాదు.. ఒకవేళ ఇరువురి మధ్య విభేదాలు వస్తే, ఇద్దరికీ నచ్చిన పెద్ద మనిషిని మధ్యవర్తిగా పెట్టుకుందామని బాబు పేర్కొన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుందామని చెప్పారు. మరి.. చంద్రబాబు తెచ్చిన ఈ కొత్త ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidud  KCR  New Proposal  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more